నటి జయప్రద సోదరుడు రాజబాబు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఆయన నిన్న సాయంత్రం మరణించినట్లు వెల్లడించారు. తన సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని తన అభిమానులు ప్రార్థించాలని జయప్రద కోరారు.తన జీవిత ప్రయాణంలో అన్నగా, సహాయంగా నిలిచిన సోదరుడిని కోల్పోవడం తనకు తీరని లోటని ఆమె వెల్లడించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు రాజబాబు అకాల మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. సినీ పరిశ్రమకు దగ్గరగా ఉన్న వ్యక్తిగా ఆయన పలువురికి పరిచయమున్నవారని, ఆయన లేరనే వార్తను నమ్మలేకపోతున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జయప్రద విషయానికొస్తే 14 ఏళ్లకే నటిగా కెరీర్ ప్రారంభించారు. 1976 నుంచి 2005 వరకు దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు. మరోవైపు రాజకీయాల్లోనూ ఉన్నారు. 1994లో తొలుత తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ నాయకులతో గొడవల కారణంగా రెండేళ్లకే బయటకొచ్చి, సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ప్రస్తుతానికైతే బీజేబీలో కొనసాగుతున్నారు. అలానే ప్రభాస్ 'ఫౌజీ'లోనూ ప్రస్తుతం నటిస్తున్నారు.