Kollywood Actor : కోలీవుడ్‌లో విషాదం...గుండెపోటుతో నటుడు టి.ప్రభాకర్ మృతి..

Update: 2025-08-08 14:15 GMT

కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు టి.ప్రభాకర్ గుండె పోటుతో కన్ను మూసారు. కర్ణాటక లోని హిరియాడ్కాలో ఉన్న తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కాంతార సినిమాలో ప్రభాకర్ కీలక పాత్ర పోషించారు. తన నటనతో అందరికీ దగ్గరైన ప్రభాకర్ కు ఐదేళ్ల క్రితమే గుండె సమస్య రావడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. తాజాగా, అయనకు మళ్లీ గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రభాకర్ కు భార్య, కుమారుడు ఉన్నారు. నాటకాల ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయన... అంచెలంచెలుగా ఎదిగారు. ప్రభాకర్ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగి పోయింది. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

Tags:    

Similar News