దాదాపు నలభై ఏళ్ల వయసు వచ్చినా.. వరుస సినిమా ఆఫర్లతో బిజీబిజీగా గడిపేస్తోంది త్రిష. ఎంతో సీనియర్ అయినా తన అందం, అభినయంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. తెలుగు మెగాస్టార్ చిరంజీవి, తమిళ్ లో సూపర్ స్టార్తో సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ తో కలిసి నటించిన వర్షం మూవీ గురించి చెప్పుకొచ్చింది. ఆ సినిమా కోసం దాదాపు 40 రోజులు నీటిలో తడుస్తూ నటించాల్సి ఉంటుందని డైరెక్టర్ శోభన్ ముందే చెప్పారు. కానీ ఈ స్థాయిలో ఉంటుందను కోలేదని చెప్పుకొచ్చింది. పాటలు, కొన్ని కీలకమైన సీన్లు కూడా వర్షంలోనే షూట్ చేశారట. దాంతో వర్షంలో షూటింగ్ అంటేనే భయం వేసిందని తెలిపింది. కానీ టాలీవుడ్ లో వర్షం సినిమాతోనే త్రిషకు మంచిపేరు వచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో ఈ అమ్మడు బిజీ అయి పోయింది.