గర్భాశయ క్యాన్సర్‌తో టీవీ నటి మృతి.. గంటల వ్యవధిలోనే ఆమె సోదరుడు కూడా..
48 ఏళ్ల టీవీ నటి డాలీ సోహి గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతూ మరణించారు. ఆమె సోదరుడు అమన్‌దీప్ కూడా కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు.;
48 ఏళ్ల టీవీ నటి డాలీ సోహి గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతూ మరణించారు. ఆమె సోదరుడు అమన్‌దీప్ కూడా కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబంలోని ఇద్దరు అక్క తమ్ముళ్లు ఒకే రోజు ప్రాణాలు కోల్పోవడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ ఉదయం, గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న డాలీ సోహి కన్నుమూశారు. ఆమె సోదరుడు అమన్‌దీప్ మరణాన్ని వెల్లడించిన కొద్దిసేపటికే ఝనక్, పరిణీతి సీరియల్స్ లో నటించిన డాలీ గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతే మృతి చెందింది. సోదరుడు అమన్‌దీప్ జాండిస్‌తో మరణించాడు.
2023లో డాలీకి గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమె కీమోథెరపీ చేయించుకున్న తర్వాత ఎక్కువ కాలం సినిమా చేయలేకపోయింది. ఆరోగ్య పరిస్థితి రీత్యా ఝనక్ ప్రోగ్రామ్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో, డాలీ పెద్ద సంఖ్యలో టీవీ సిరీస్‌లలో ఉన్నారు.
డాలీ, కెనడాలో నివసిస్తున్న NRI నటుడు అవ్నీత్ ధనోవాను వివాహం చేసుకుంది. డాలీకి కూతురు అమేలీ ఉంది. “నా కూతురు అమేలియాతో నా సమస్య గురించి మాట్లాడడం చాలా కష్టం. ఆమె వయస్సు కేవలం 14 సంవత్సరాలు. నేను నిదానంగా నా కూతురితో నా వ్యాధి గురించి చెప్పాను. త్వరగా కోలుకుంటానని చెప్పాను. కానీ నా వ్యాధి నన్ను రోజు రోజుకి మరింత క్షీణించేలా చేసింది. దాంతో నా కూతురికి నా పరిస్థితి వివరించాను.. తను నా పరిస్థితిని అర్థం చేసుకుంది అని ఓ ఇంటర్వ్యూలో డాలీ తెలిపింది.