మెగాస్టార్ చిరంజీవికి యూకే అవార్డు లభించింది. ఆయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను బ్రిటన్ ప్రభుత్వం లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును ప్రకటించింది. ఈ ప్రతిష్టా త్మక పురస్కారాన్ని మార్చి 19న యూకే పార్లమెంటులో చిరంజీవికి ప్రదానం చేయనున్నారు. 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించాడు చిరంజీవి. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు చిన శివశంకర వర ప్రసాద్. 1978లో వచ్చిన పునాదిరాళ్ళు చిత్రంతో చిరంజీవి నటజీవితం ప్రారంభమైంది. 1987లో చిరంజీవి నటించిన స్వయంకృషి చిత్రం రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికపై ప్రదర్శితమైంది. ఈ చిత్రానికి గాను చిరంజీవి 1988లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది బహుమతి అందుకున్నాడు. అదే సంవత్స రం చిరంజీవి సహనిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ చిత్రం జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది. ఆ తర్వాత చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగారు. ఎంత మంది నటులున్నా.. చిరంజీవికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఆయన సినీ రంగానికి చేసిన సేవలకు గాను 2006లో పద్మభూషణ్ 2024లో పద్మవిభూషణ్ పురస్కారాలతో భారత ప్రభు త్వం సత్కరించింది. గత సం వత్సరం ఏఎన్నార్ జాతీయ అవార్డు దక్కింది. చిరంజీవికి తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డు లు లభించాయి. 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు 2022లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కాయి. చిరంజీవి బ్రిటన్ ప్రభుత్వం అందించే లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును ఈ నెల 19న బ్రిటన్ పార్లమెంటులో స్వీకరించ నున్నారు.