భరించలేని హింస.. 'మార్కో' సినిమా మధ్యలో నుంచి బయటకు వచ్చేసిన కిరణ్ అబ్బవరం..

మూడు గంటల సినిమా మనసును హత్తుకోవాలి. కాస్త నవ్వించాలి. ఈ రోజుల్లో సహజ కథలకు స్థానం లేకుండా పోయింది. కొంత కృత్రిమత్వం మేళవించినా, క్రూరత్వం పాళ్లు ఎక్కువవుతోంది. సినిమా స్క్రీన్ మీద రక్తం ఏరులై పారుతోంది. పొడుచుకోవడం, చంపుకోవడం ఇదే నేటి సినిమా తీరు..;

Update: 2025-03-12 08:33 GMT

మూడు గంటల సినిమా మనసును హత్తుకోవాలి. కాస్త నవ్వించాలి. ఈ రోజుల్లో సహజ కథలకు స్థానం లేకుండా పోయింది. కొంత కృత్రిమత్వం మేళవించినా, క్రూరత్వం పాళ్లు ఎక్కువవుతోంది. సినిమా స్క్రీన్ మీద రక్తం ఏరులై పారుతోంది. పొడుచుకోవడం, చంపుకోవడం ఇదే నేటి సినిమా తీరు.. అందుకే అతడు కూడా ఓ నటుడైనా ఆ హింసను భరించలేకపోయాడు.. పైగా గర్భవతి అయిన భార్యను తీసుకుని వెళ్లాడేమో ఆమె ఆ హింసను భరించలేకపోయింది. సినిమా మధ్యలో నుంచే బయటకు వచ్చేశారు ఆ జంట.. అంత రక్తపాతం చిందించే ఆ సినిమా హనీఫ్ అదేని దర్శకత్వంలో వచ్చిన మార్కో. 

ఓ ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడుతూ "నేను మార్కో చూశాను, కానీ నేను దాన్ని పూర్తిగా చూడలేకపోయాను. సెకండాఫ్ లో నేను బయటకు వచ్చేశాను. హింస నాకు కొంచెం ఎక్కువగా అనిపించింది. నేను నిజానికి నా భార్యతో కలిసి సినిమా చూడడానికి వెళ్ళాను, కానీ సినిమా మొత్తం చూడలేకపోయాము. ఎలాగో ఫస్టాఫ్ చూసి బయటకు వచ్చేసాము. నా భార్య అసలే గర్భంతో ఉంది. అంత హింస భరించలేకపోయింది. "సినిమాలు ప్రజలను ప్రభావితం చేస్తాయి. మనం చూసేది కనీసం మూడు రోజుల పాటు మనతో ప్రయాణిస్తుంది. 

"అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు, సినిమాను సినిమాలాగే చూసేవాళ్ళు ఉంటారు, కానీ దాని నుండి ఏదో ఒకటి తీసుకునేవాళ్ళు కూడా ఉంటారు. నేను ఇప్పుడు దాని ప్రభావానికి గురి కాకపోవచ్చు, కానీ నా టీనేజ్ చివరలో లేదా ఇరవైల ప్రారంభంలో, నేను కూడా సినిమాల వలన ప్రభావితమయ్యాను" అని ఆయన అన్నారు.

Tags:    

Similar News