Unstoppable With NBK: బాలయ్యతో మామూలుగా ఉండదు మరీ..! అన్‌స్టాపబుల్ షోకు కొత్త రికార్డ్..
Unstoppable With NBK: ఇప్పటివరకు యంగ్ హీరోలు, హీరోయిన్లు హాస్ట్‌లుగా ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నించారు.;
Unstoppable With NBK: ఇప్పటివరకు పలువురు యంగ్ హీరోలు, కొందరు హీరోయిన్లు హాస్ట్‌లుగా ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నించారు. అదే బాటలోకి సీనియర్ హీరో బాలకృష్ణ వస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఆఫ్ స్క్రీన్ బాలయ్య చాలా సరదాగా ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే అయినా.. హోస్టింగ్ మాత్రం ఎలా చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. బాలయ్య యాక్టింగ్‌లోనే కాదు హోస్టింగ్‌లో కూడా సూపర్ హిట్ అని నిరూపించుకున్నారు.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహాలో ఇప్పటివరకు పలు టాక్ షోలు వచ్చాయి. కానీ ఏదీ 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' సాధించినంత విజయాన్ని సాధించలేకపోయాయి. బాలయ్య టైమింగ్, ఎనర్జీ.. ఈ షోకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. గెస్ట్ ఎవరైనా కూడా వారితో సరదాగా మాట్లాడుతూ.. ఆటలు ఆడిస్తూ.. వారి వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలను అడుగుతూ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్మెంట్‌ను అందించారు. అందుకే ఈ షో ఒక కొత్త రికార్డును దక్కించుకుంది.
ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎమ్‌డీబీ) అనేది కేవలం సినిమాలకు మాత్రమే కాదు రియాలిటీ షోలకు కూడా రేటింగ్ ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఏ సినిమా ఎంత పాపులర్ అయ్యింది, ఆ సినిమాకు ఎలాంటి రివ్యూలు వచ్చాయి.. ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఐఎమ్‌డీబీ సినిమాలకు, షోలకు తమ రేటింగ్‌ను అందజేస్తోంది. ఐఎమ్‌డీబీ రేటింగ్ అనేది ప్రతీ సినిమాకు చాలా కీలకం. అది ఒక ల్యాండ్ మార్క్ లాంటిది. ఇప్పుడు దాని ముద్ర అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోపై పడింది.
పలువురు స్టార్ హీరోలతో, యంగ్ హీరోలతో కలిసి అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 7 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఇంకొక మూడు ఎపిసోడ్లు పూర్తయితే.. అన్‌స్టాపబుల్ మొదటి సీజన్‌ను పూర్తి చేసుకుంటుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీ.. ఐఎమ్‌డీబీ టాప్ 10 రియాలిటీ షోల్లో ఒకటిగా రికార్డ్ సాధించింది. దేశవ్యాప్తంగా ఉన్న రియాలిటీ షోలలో ఒక తెలుగు రియాలిటీ షో ఉండడం.. అది కూడా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అవ్వడం ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తోంది.