Unstoppable With NBK: ఆ నిర్ణయం తర్వాత కెరీర్ అన్‌స్టాపబుల్: మహేశ్ బాబు

Unstoppable With NBK: బాలయ్య.. మహేశ్‌ను ఆటపట్టించిన తీరు చాలా ఫన్‌ను క్రియేట్ చేసింది.;

Update: 2022-02-03 13:58 GMT

Unstoppable With NBK: గత కొన్నిరోజులుగా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తు్న్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' చూస్తుండగానే చివరి ఎపిసోడ్ వరకు వచ్చేసింది. బాలయ్య హోస్టింగ్‌తో, కామెడీ టైమింగ్‌తో ఇప్పటికే ఈ షో ఇండియాలోనే నెంబర్ 1 టాప్ షోగా నిలిచింది. ఇక ఇలాంటి షో ఫైనల్ ఎపిసోడ్ కోసం ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబును బరిలోకి దించింది ఆహా టీమ్.

మహేశ్ బాబు పెద్దగా బుల్లితెరపై కనిపించే వ్యక్తి చాలు. అవార్డు ఫంక్షన్లకు కూడా ఆయన రావడం చాలా అరుదు. అలాంటి మహేశ్‌ను, బాలకృష్ణను ఒకే స్క్రీన్‌పై చూడడం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అన్‌స్టాపబుల్ ఫైనల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ ప్రోమో చూస్తేనే అర్థమవుతోంది.. ఎపిసోడ్‌లో ఎంత ఫన్ ఉండబోతుందో..

బాలకృష్ణ సరదాగా మాట్లాడే మనిషి, కానీ మహేశ్ అలా కాదు.. దీంతో బాలయ్య.. మహేశ్‌ను ఆటపట్టించిన తీరు చాలా ఫన్‌ను క్రియేట్ చేసింది. ముందుగా బాలయ్య డైలాగు ఒకటి మహేశ్ నోటి నుండి వినాలనుంది అనగా.. బాలయ్య డైలాగ్స్ ఆయన చెప్తేనే బాగుంటుందని సమాధానం ఇచ్చాడు మహేశ్.

కెరీర్‌లో వచ్చిన బ్రేక్ గురించి బాలయ్య అడుగుతూ.. మూడేళ్లు గ్యాప్ ఎందుకు ఇచ్చావ్ అని మహేశ్ బాబుతో అన్నారు. దీనికి మహేశ్ కెరీర్‌ను బెటర్ చేసుకోవడానికే ఆ టైమ్ తీసుకున్నానని, దాని తర్వాతే తన కెరీర్ అన్‌స్టాపబుల్‌గా సాగిందని సమాధానమిచ్చాడు. మహేశ్ సీక్రెట్ పెళ్లి గురించి కూడా షోలో అడిగేశారు బాలయ్య. దీనికి మహేశ్ ఏం సమాధానం ఇచ్చాడో తెలియాలంటే శుక్రవారం విడుదలయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే..

Tags:    

Similar News