Movies in Theater and OTT: సినీ ప్రేమికులకు పండగ.. ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో వస్తున్న సినిమాలు..
Movies in Theater and OTT: ఈ మధ్య ప్రతి వారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంది.. ఎన్ని సినిమాలు వచ్చినా అందులో కథ,కధనం బావుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు.;
Movies in Theater and OTT: ఈ మధ్య ప్రతి వారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంది.. ఎన్ని సినిమాలు వచ్చినా అందులో కథ,కధనం బావుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు.. ఇంతకు ముందు థియేటర్లలోనే సినిమాలు రిలీజ్ అయ్యేవి. కోవిడ్ పుణ్యమా అని ఓటీటీలకు ఆదరణ పెరిగింది. సినిమా అంటే థియేటర్‌లోనే చూడాలి అని అనుకునే వారి సంఖ్య రానురాను తగ్గుతోంది. అందుకే కొన్ని సినిమాలు ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు చాలా సినిమాలే వస్తున్నాయి.. అవేంటో చూద్ధాం..
'ముత్తు'
తారాగణం: శింబు, సిద్ధి ఇద్నానీ, రాధిక, సిద్ధిఖ్ సంగీతం: ఏఆర్ రెహమాన్ దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్ విడుదల: 15-09-022
నేను మీకు బాగా కావాల్సినవాడిని
తారాగణం: కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్, సోను ఠాకుర్, సంగీతం: మణిశర్మ దర్శకత్వం: శ్రీధర్‌గాదె విడుదల: 16-09-2022
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
తారాగణం: సుధీర్ బాబు, కృతిశెట్టి సంగీతం: వివేక్ సాగర్, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ, విడుదల: 16-09-2022
శాకినీ డాకిని
తారాగణం: రెజీనా, నివేదా థామస్, సంగీతం: మిక్కీ జే మేయర్ దర్శకత్వం: సుధీర్ వర్మ విడుదల: 16-09-2022
కోటికొక్కడు
తారాగణం: సుదీప్, మడోనా సెబాస్టియన్, అఫ్తాబ్, రవిశంకర్, శ్రద్ధాదాస్, సంగీతం: అర్జున్ జన్య, దర్శకత్వం: శివ కార్తీక్, విడుదల : 16-09-2022
సకల గుణాభిరామ
తారాగణం: వీజే సన్నీ, శ్రీతేజ్, అషిమా నర్వాల్, చమ్మక్ చంద్ర, సంగీతం: అనుదీప్ దేవ్, దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్, విడుదల: 16-09-2022
నేను కేరాఫ్ నువ్వు
తారాగణం: ధనరాజ్, రత్న కిషోర్, సాగారెడ్డి, సంగీతం: ఎన్ఆర్ రఘునాథమ్, దర్శకత్వం: సాగారెడ్డి తుమ్మ, విడుదల: 16-09-2022
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు
అమెజాన్ ప్రైమ్‌లో.. విరుమన్ (తమిళ చిత్రం) సెప్టెంబర్ 11
డిస్నీ+హాట్‌స్టార్‌లో.. విక్రాంత్ రోణ (తెలుగు) సెప్టెంబర్ 16న స్ట్రీమ్ అవుతుంది. అదే రోజు మరో హిందీ సినిమా దహన్ కూడా స్ట్రీమ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో.. జోగీ హిందీ సినిమా సెప్టెంబర్ 16న స్ట్రీమ్ అవుతోంది.
సోనీలివ్‌లో.. రామారావు ఆన్ డ్యూటీ సెప్టెంబర్ 15న వస్తోంది. కాలేజ్ రొమాన్స్ (హిందీ సిరీస్ 3)కూడా సెప్టెంబర్ 15 వస్తోంది.
ఎంఎక్స్ ప్లేయర్‌లో.. శిక్షా మండల్ (హిందీ) సెప్టెంబరు 15న వస్తోంది.