Upasana Konidela: కరోనా పాజిటివ్.. ఐసోలేషన్ పూర్తి ..: ఉపాసన
Upasana Konidela: గత వారం చెన్నైలో ఉన్న అమ్మమ్మా, తాతయ్యలను కలవడానికి వెళ్లే ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ అని వచ్చింది.;
Upasana Konidela: కోవిడ్ తగ్గిందనుకుంటున్నాం కానీ అక్కడక్కడా కొన్ని కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా మెగా కోడలు కోవిడ్ బారిన పడి కోలుకున్నానని పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ని షేర్ చేశారు. గత వారం చెన్నైలో ఉన్న అమ్మమ్మా, తాతయ్యలను కలవడానికి వెళ్లే ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ అని వచ్చింది. దీంతో వారం రోజులుగా వైద్యుల సూచనతో ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకున్నాను అని ఇన్ స్టా పోస్ట్ లో పేర్కొన్నారు.
ఇప్పుడు నా పనిలో నిమగ్నమవుతున్నాను. కోవిడ్ వచ్చిన వారు కొన్ని చిన్న చిన్న సమస్యలతో బాధపడినట్లు వివరించారు. అయితే ఆ సమస్యలేవీ నాలో కనిపించలేదు.. ఎందుకంటే నేను మెంటల్ గా, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాను.. అందుకే నాకు ఎలాంటి సమస్యలు తలెత్తవు. మళ్లీ వైరస్ విజృంభిస్తుందా అంటే చెప్పలేను.. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి అని ఉపాసన రాసుకొచ్చారు.