రామ్ పోతినేని హీరోగా పి మహేష్ బాబు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం ఇది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నాం అని గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ మూవీలో ఓ కీలకమైన పాత్ర చేస్తోన్న కన్నడ హీరో ఉపేంద్ర పోస్టర్ ను విడుదల చేశారు. ఉపేంద్ర రామ్ మూవీలో నటిస్తున్నాడు అనే వార్తలు చాలానే వచ్చాయి. లేటెస్ట్ గా అతని పేరు మీదుగా ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ అనే టైటిల్ ను కూడా పెట్టబోతున్నారు అనే న్యూస్ వచ్చింది.
ఉపేంద్ర లుక్ చూస్తే సాలిడ్ గా కనిపిస్తున్నాడు. అతని పాత్ర పేరు సూర్య కుమార్ అని పెట్టారు. ఈ పోస్టర్ తో పాటు అందని వాడు.. అందరి వాడు మన సూర్యకుమార్ అనే క్యాప్షన్ కనిపిస్తోంది. ఇందులో ఉపేంద్ర ఓ సినిమా హీరో పాత్ర చేస్తున్నాడట. ఆ హీరోను ఆరాధించే కుర్రాడిగా రామ్ కనిపిస్తాడట. ఆ హీరోకు ఆంధ్రా కింగ్ అనే బిరుదు ఉంటుందని.. ఆ బిరుదునే సినిమా టైటిల్ గా పెట్టబోతున్నారు అనేది న్యూస్. మొత్తంగా ఉపేంద్ర కీలక పాత్ర అంటే ఖచ్చితంగా అంచనాలుంటాయి. ఆ అంచనాలను సినిమా అందుకుంటే రామ్ పోతినేనికి ఫైనల్ గా ఓ హిట్ పడుతుంది.