పద పదవే వయ్యారి గాలిపటమా.. అంటూ పతంగుల పండుగ జరుపుకొంది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట. హైదరాబాద్ లో తమ స్వ గృహంలో వీళ్లు సంక్రాంతి వేడుకలను జరుపుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పతంగులు ఎగురవేస్తూ ఎంతో ఆనందంగా కనిపించిన ఈ జంట అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. సాధారణంగా మెగా ఫ్యామిలీ సంక్రాంతి పండుగను బెంగళూరులోని వాళ్ల ఫాంహస్ లో జరుపుకొంటుంది. ఈ సారి మెగా స్టార్ చిరంజీవి ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. దీంతో వీళ్ల హైదరాబాద్ లోనే పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో వరుణ్ తేజ్ సంక్రాంతి గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకు న్నారు. మేమంతా ఎంతో ఆసక్తి గా ఎదురుచూసే పండగ ఇది. హిందీ పరిశ్రమలో దీపావళి ఎలానో టాలీవుడ్ కి సంక్రాంతి అలాంటిది! అని వ్యాఖ్యానించారు. సంక్రాంతి అనేది సినిమా ప్రేమికులకు ఒక పెద్ద సీజన్.. ప్రతి సంవత్సరం చాలా పెద్ద సినిమాలు విడుద లవుతాయి. దక్షిణాది లో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో, ఈ పండుగ వేళ థియేటర్ల లో సినిమాలు వీక్షిస్తూ ఆనందంగా జరుపు కుంటారు