Varun Tej : కొరియన్ కనకరాజుగా వరుణ్ తేజ్

Update: 2026-01-19 07:50 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా అతని కొత్త సినిమా ‘కొరియన్ కనకరాజు’ గ్లింప్స్ విడుదల చేసింది టీమ్. ఈ గ్లింప్స్ బావుంది. ఆకట్టుకునేలా ఉంది. ఏదో కొత్తదనం ఉన్న మూవీలా ఉండేలా ఉంది. సింపుల్ సీన్ తోనే కనిపించినా గ్లింప్స్ మాత్రం మెప్పించింది అనే చెప్పాలి. కమెడియన్ సత్యను కొంతమంది కొరియన్ పోలీస్ లు కనకరాజు జాడ చెప్పమని కట్టేసి కొడుతుంటారు. అతను ఎంతగా అరిచినా కనకరాజు గురించి తెలియదు అని చెబుతుంటాడు. అతనితో పాటు హీరోయిన్ రితికా కూడా ఎంటర్ అవుతుంది. అయినా పోలీస్ లు కొట్టడం ఆపరు. ఆ టైమ్ లో ఓ లుంగీ కట్టుకుని కత్తి పట్టుకుని ఆ పోలీస్ లందరినీ నరికేస్తుంటాడు కనకరాజు. చివరిలో అతను కొరియన్ డైలాగ్ కూడా చెబుతాడు. అదేంటీ అని రితికా నాయక్ అంటే .. టైటిల్ అని అంటాడు సత్య. కట్ చేస్తే కొరియన్ కనకరాజు అనే పేరు పడుతుంది.

ఇది సింపుల్ గా ఉంది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. మామూలుగా మన దెయ్యాలు అయితే బోర్ కొట్టేశాయి. అందుకే కొరియన్ దెయ్యం పట్టుకున్నాడేమో దర్శకుడు. అది కొత్తగా ఉంది పాయింట్. మొత్తంగా వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్ గా వచ్చిన గ్లింప్స్ మాత్రం చాలా బావుంది. అయితే కొన్నాళ్లుగా హిట్ అనే చూడలేకపోతున్నాడు వరుణ్ తేజ్. ఈ మధ్య వచ్చిన మూవీస్ అన్నీ వరుసగా పోతున్నాయి. మరి ఈ కొరియన్ కనకరాజు అయినా అతనికి విజయం తెస్తాడేమో చూడాలి.

Full View

Tags:    

Similar News