సమంత రూత్ ప్రభు.. ఈ పేరు ఇండస్ట్రీలో టాప్ లేపింది. ఓ దశలో తెలుగు, తమిళ్ లో ఫుల్ బిజీగా ఉండిపోయింది. వరుస విజయాలు.. అవార్డులు, రివార్డులూ అందుకుంది. అదే ఊపులో నాగ చైతన్యను ప్రేమించాను అని చెప్పి పెళ్లి చేసుకుంది. ఇంత వరకు బానే ఉంది. తర్వాత ద ఫ్యామిలీ మేన్ 2 మూవీ నాగ చైతన్య, సమంత మధ్య పెద్ద అగాధం తెచ్చింది. దీంతో నాలుగేళ్ల వైవాహిక జీవితాన్ని ఆపేసుకున్నారు ఇద్దరు. 2021లోనే విడాకులు తీసుకున్నారు. ఆ విషయంలో సమంత బాగా డిస్ట్రబ్ అయింది. డిప్రెషన్ కు లోనైంది. వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంది. బట్ అదే టైమ్ లో సినిమాలు మాత్రం ఆపలేదు. యశోద, శాకుంతలం, ఓ తమిళ్ మూవీతో పాటు వరుసగా డిజాస్టర్లు పడ్డాయి. 2023లో చేసిన ఖుషీ మాత్రం కాస్త ఫర్వాలేదు అనిపించుకుంది. ఇక 2025లో తను ప్రొడ్యూసర్ గా మారింది. శుభం టైటిల్ తో ఓ మూవీ చేసింది. ఇది బాగానే ఆకట్టుకుంది. తర్వాత తన రెండో పెళ్లి ముందు నుంచీ ఊహించినట్టుగానే రాజ్ తో అయింది. ఆ క్రమంలోనే మా ఇంటి బంగారం అనే టైటిల్ తో ఓ మూవీ చేస్తోంది. ఈ మూవీని ఈ యేడాది మే 15న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది టీమ్. దర్శకురాలు నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం చేసింది.
మా ఇంటి బంగారం టీజర్ విడుదలైంది. బానే ఉన్నట్టుగానే ఉంది. బట్ ఈ మూవీతో సమంతను ఆడియన్స్ ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారు అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే చైతన్య ఉన్నంత వరకు ఓకే. విడిపోయిన తర్వాత కూడా ఓకే అనిపించేలా ఉంది. బట్ రెండో పెళ్లి తర్వాత మళ్లీ తనను ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది అసలు విషయం. ఓ రకంగా చూస్తే ఆమెపై ఇప్పటికీ చాలామందిలో నెగెటివిటీ ఉంది. రెండో పెళ్లి తర్వాత అది ఇంకా పెరుగుతుంది అనిపించేలా ఉంది. అది ఇన్ డైరెక్ట్ గా తన సినిమాపై కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే సినిమా కంటెంట్ ఎంత బలంగా ఉన్నా.. ఈ నెగెటివిటీ కారణంగా ఆడియన్స్ లో ఓ ఒపీనియన్ పడుతుంది. అది సినిమా రిజల్ట్ పై కూడా ప్రభావం చూపిస్తుంది. మొత్తంగా నిజంగా ఆడియన్స్ అంతా లైట్ తీసుకున్నా.. ఇంకా తనలో పాజిటివిటీ ఉన్నా.. సినిమాపై ప్రభావం పడదు. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ రిజల్ట్ పై ఎఫెక్ట్ పడుతుంది.