Hari Hara Veeramalla : భారీ ఓపెనింగ్స్‌తో దుమ్మురేపిన వీరమల్లు...పవన్ కెరీర్‌లోనే రికార్డ్..
పవన్ కల్యాణ్ ఫ్యాన్‌తో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూసిన హరిహర వీరమల్లు థియేటర్స్‌లో సందడి చేస్తోంది. గురువారం గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పవన కల్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో గత 5 ఏళ్లుగా సినిమా షూటింగ్ జరిగింది. ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చింది మూవీ యూనిట్. ఎట్టకేలకు అన్ని అవాంతరాలను దాటుకొని ఫాన్స్ ను ఆకట్టుకుంటుంది హరి హర వీరమల్లు.
ఒక యోధుడిగా పవర్ స్టార్ యాక్టింగ్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన మూవీగా నిలిచిందని అంటున్నారు. అయితే వీరమల్లుకు బెనిఫిట్ షోల ద్వారా రూ. 12.7 కోట్ల నెట్ వస్తే.. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 32.5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది..