Sankranti Ki Vastunnam : రికార్డులు తిరగ రాస్తున్న వెంకీ 'సంక్రాంతికి వస్తున్నాం'

Update: 2025-01-30 10:30 GMT

వెంకటేశ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. పాత రికార్డులను తిరగరాస్తూ...కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. వెంకిమామ హిస్టరిలోనే అత్యధిక వసూళ్లను రాబడుతోంది. మూవీ రిలీజ్ అయ్యి.. రెండు వారాలు గడుస్తునా... రికార్డుల్లో ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఇపుడు ఈ సినిమా పలు రికార్డులను పాతరేసింది. గతేడాది పొంగల్ సీజన్ లో విడుదలైన వెంకటేష్ సైంధవ్ మూవీ మొత్తం కలెక్షన్స్ 10 కోట్ల షేర్ మార్క్ కూడా దాటలేదు. అలాంటి స్థితిలో ఇపుడు 300 కోట్ల గ్రాస్.. 150 కోట్ల షేర్ మార్క్ అందుకోవడం మాములు కమ్ బ్యాక్ కాదంటున్నారు ట్రేడ్ ఎనలిస్టులు.

Tags:    

Similar News