Vidya Balan : నేనూ అల్లరి పిల్లనే అంటున్న విద్యాబాలన్

Update: 2025-06-03 06:00 GMT

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డర్టీ పిక్చర్ సినిమాతో ఇండియా వైడ్గా సూపర్ స్టార్ గా నిలిచింది ఈ భామ. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ మూవీల్లో నటించిన ఈ అమ్మడు.. ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ప్రజంట్ సుధీర్ బాబు మూవీ ‘జటాధర’లో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే సూపర్ స్టార్ రజ నీకాంత్ తో ఓ సినిమాలో నటించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే, బయట తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పే విద్యాబాలన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాలు, నటన, వ్యక్తిగత జీవితం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'సినీ ఇండస్ట్రీలో మార్పు సహజం. పరిస్థితులకు తగ్గట్టు మారుతారు. అది అంగీకరించక తప్పదు. ముఖ్యంగా హీరోయిన్లు చాన్స్ లకు తగ్గట్లుగా మారుతూ ఉండాలి. అప్పుడే, వారు లైమ్ లైట్ లో ఉంటారు. లేకపోతే ఫేడ్ అవుట్ అవుతారు. నేను నా చిన్న తనంలో చాలా అల్లరి చేసేదాన్ని. ముఖ్యంగా నైట్ లు ఎక్కువగా మేల్కొనే దాన్ని. ఆ అలవాటు మానేయడానికి నాకు చాలా టైం పట్టింది. అయితే నా జీవితాన్ని మార్చేసింది మాత్రం సినిమాలే. పెండ్లి తర్వాత కూడా నేను మూవీలు చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది' అంటూ విద్యాబాల న్ చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News