విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఇది రూమర్స్ అన్నారు, గాసిప్ అన్నారు.. చివరికి వీరి పెళ్లి సెట్ అయింది అన్నారు. అన్ని ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టేసిందీ జంట. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఈ నెల 26న జరగబోతోందని అఫీషియల్ గా చెప్పేశారు. దీంతో పాటు మార్చి 4న తాజ్ కృష్ణాలో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసింది జంట. మామూలుగా ఈ వార్త కొత్తదేం కాదు. బట్ అఫీషియల్ గా వచ్చేసింది కాబట్టి ఆ ఇద్దరి అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఇక ఈ పెళ్లికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రలను కూడా అటెండ్ చేయాలని విజయ్ దేవరకొండ నిర్ణయించుకున్నట్టు టాక్. అలాగే అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్ వంటి వారంతా అటెంట్ అవుతారు. వీరితో పాటు బాలీవుడ్ నుంచి షాహిద్ కపూర్, రణ్ బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ కూడా అటెండ్ అవుతారు అనే టాక్ వినిపిస్తోంది.
పెళ్లి మాత్రం రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో జరపబోతున్నారు. వీరి పెళ్లి కార్డ్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే చాలామంది అతిథులకు ఆహ్వానాలు కూడా అందించారు. మొత్తంగా ఇద్దరికీ పెళ్లి సందడి వచ్చేసినట్టేనని చెప్పాలి.