Virosh : మూడు ముళ్లు ఏడడుగుల తంతు ముగిసింది

Update: 2026-02-26 06:30 GMT

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సరిగ్గా ముహూర్తానికి మూడు ముళ్లు పడ్డాయి. పెళ్లి సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకు అయింది. ఇద్దరి మధ్య దాదాపు ఎనిమిదేళ్లుగా సాగిన ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పడింది. ఇన్నాళ్లు ఒక్కొక్కరుగా ఉన్న వీరు ఇప్పుడు జంట అయ్యారు. ఈ పెళ్లికి కేవలం కొంతమంది ఆహ్వానితులు మాత్రమే హాజరయ్యారు. వారంతా సంతోషంగా ఈ జంటను ఆశీర్వదించారు.

నిన్నటికి నిన్న ఏకంగా దేశ ప్రధాని మోదీ ఏకంగా ఆశీర్వాదాలు పంపిస్తూ ఆ జంటకు శుభాకాంక్షలు చెప్పాడు. విరోష్ తో పేరుతో జరిగిన పెళ్లి తంతు చాలా గొప్పగా సాగింది అనే టాక్ ఉంది. మరి పెళ్లి తర్వాత కూడా రష్మిక సినిమాలు కొనసాగిస్తుందా లేక ఆపేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే కొన్నాళ్లు సినిమాలు చేయొచ్చు అనే టాక్ ఉంది. తను ఆల్రెడీ ఒప్పుకున్న మూవీస్ ను పూర్తి చేస్తుంది. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. 

Tags:    

Similar News