Vijay devarakonda: ఓ కల్ట్ క్లాసిక్ రీమేక్‌లో విజయ్ దేవరకొండ, సమంత..

Vijay devarakonda: విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Update: 2022-03-25 12:33 GMT

Vijay devarakonda: టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్‌లో పెద్దగా సినిమాలు రాకపోయినా.. వాటికి ఉండే క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. అలాంటి ఒక కాంబినేషన్ విజయ్ దేవరకొండ, సమంత. ప్రస్తుతం వీరిద్దరు ఏం చేసినా సెన్సేషనే. అయితే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అది చాలావరకు నిజమేనంటూ టాలీవుడ్ ఫిల్మ్ సర్కి్ల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఓ కల్ట్ క్లాసిక్‌కు రీమేక్ అని కూడా ప్రచారం సాగుతోంది.

విజయ్ దేవరకొండ, సమంత కలిసి 'మహానటి' చిత్రంలో నటించారు. అప్పట్లో వీరిద్దరి ఫ్రెష్ పెయిర్‌కు మంచి మార్కులే పడ్డాయి. అప్పటినుండి ఇప్పటివరకు వీరి కెరీర్‌లో చాలా మార్పులు వచ్చాయి. సమంత స్క్రిప్ట్ సెలక్షన్‌లో ,చాలా మార్పులు వచ్చాయి. విజయ్ దేవరకొండ ఏకంగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. అయితే ఇంతకాలం తర్వాత మరోసారి వీరు కలిసి నటించడం మ్యుచువల్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'లైగర్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత ఫీల్ గుడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నాడు విజయ్. అయితే ఈ సినిమాలో సమంతనే హీరోయిన్ అని దాదాపు ఫైనల్ అయినట్టు ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమా ఒకప్పటి క్లాసిక్ 'రోజా' సినిమాకు రీమేక్ అని కొత్తగా రూమర్ మొదలయ్యింది.

దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో 'రోజా' కూడా ఒకటి. అయితే శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ సినిమా కథ కూడా రోజాలాగానే ఉంటుందని సమాచారం. ఇది పూర్తిగా కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న కథ అని రమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు విజయ్ దేవరకొండ నటించిన అన్ని క్యారెక్టర్స్‌లో, ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ అని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి.

Tags:    

Similar News