Vijay Devarakonda: రా.. చూసుకుందాం.. విజయ్‌తో నిహారిక ఫైట్.
Vijay Devarakonda: సోషల్ మీడియా సెలబ్రెటీతో విజయ్ దేవరకొండ ఫైట్ చేస్తున్నారు. రా.. చూసుకుందాం అంటూ వీరిద్దరూ ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటున్నారు.;
Vijay Devarakonda: సోషల్ మీడియా సెలబ్రెటీతో విజయ్ దేవరకొండ ఫైట్ చేస్తున్నారు. రా.. చూసుకుందాం అంటూ వీరిద్దరూ ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటున్నారు. లైగర్‌తో తలపడేందుకు ఆమె కూడా కిక్ బాక్సింగ్‌లో ట్రైనింగ్ అయినట్లుంది. విజయ్‌తో సమానంగా పంచ్‌లు వేసేందుకు సిద్ధపడుతోంది. ఇదంతా సినిమా ప్రమోషన్‌లో భాగమే అయినా ఈ విడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఫన్నీ వీడియోలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పాటు సెలబ్రెటీలను కూడా ఆకట్టుకుంటున్న నిహారిక ఈ మధ్య సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లు కూడా చేస్తోంది. కేజీయఫ్, సర్కారు వారి పాట, రన్ వే 34, జెర్సీ, మేజర్ ఇలా ఇటీవల విడుదలైన పలు క్రేజీ ప్రాజెక్టులకు ఆయా చిత్రాల హీరోలతో కలిసి ప్రమోషనల్ వీడియోలు చేస్తోంది.
తాజాగా లైగర్ కోసం విజయ్‌తో తలపడుతోంది నిహారిక. ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. వీడియో ఆరంభంలో విజయ్‌తో ఫైట్ చేస్తున్నట్లు కనిపించినప్పటికీ అనంతరం ఆయన బాడీకి ఫిదా అవుతుంది నిహారిక.
విజయ్‌ని ఇమిటేట్ చేస్తూ నత్తి ఉన్నట్లు ఆమె మాట్లాడడం నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన సెలబ్రెటీలు ఇలియానా, సుస్మిత కొణిదెల, సోనాల్ దేవ్‌రాజ్, నిఖిల్ తనీజా ఫన్నీగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.