విజయ్ దేవరకొండ ఇప్పటి వరకూ హీరోగా 12 సినిమాలు చేశాడు. వీటిలో విజయం సాధించింది రెండు మూడు శాతమే. అయితే ఇలా ఫ్లాప్ అయిన సినిమాల్లో కూడా ఇంగ్లీష్ టైటిల్స్ ఉన్నవి ఎక్కువగా ఉండటం విశేషం. హీరోగా ఫస్ట్ మూవీ పెళ్లి చూపులు అయినా.. అంతకు ముందు ఎవడే సుబ్రహ్మణ్యంతో మెరిశాడు. పెళ్లి చూపులు అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ ఫేమ్ అయిపోయాడు. గీత గోవిందం స్టార్డమ్ తెచ్చిందని చెప్పాలి. కానీ ఆ తర్వాత నుంచి ఆ స్థాయి విజయం ఇప్పటి వరకూ చూడలేదు విజయ్. ప్రస్తుతం కింగ్ డమ్ మూవీతో వస్తున్నాడు. అయితే తరచి చూస్తే విజయ్ కి ఇంగ్లీష్ టైటిల్ ఎప్పుడూ కలిసి రాలేదు. అంటే సినిమా రిలీజ్ కు ముందు ఇది చెప్పి భయపెట్టడం అని కాదు.. ఇలాంటి సెంటిమెంట్స్ ను ఇండస్ట్రీ బలంగా నమ్ముతుంది కదా.. అలా చూస్తే ఈ టైటిల్ ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తే మళ్లీ పాత కథే అవుతుంది. బ్రేక్ అయితే బ్లాక్ బస్టర్ వస్తుంది.
విజయ్ హీరోగా నటించిన 12 సినిమాల్లో ఫ్లాపులు చూస్తే నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ద ఫ్యామిలీ స్టార్.. ఈ మూవీస్ కీలకంగా ఉన్నాయి. అన్నీ ఇంగ్లీష్ టైటిల్స్ వే. మొత్తం ఐదు సినిమాలు. ఇవి కాకుండా ఇంగ్లీష్ టైటిల్ తోనే వచ్చిన టాక్సీవాలా ఓ మోస్తరు విజయం సాధించింది. సో.. చూస్తోంటే అతనికి ఇంగ్లీష్ టైటిల్స్ గండం కూడా ఉన్నట్టుంది. మరి ఈ గండం నుంచి కింగ్ డమ్ గట్టెక్కిస్తుందా లేదా అనేది చూడాలి.