Vijay Devarakonda : మండు వేసవికి విజయ్ దేవరకొండ

Update: 2025-01-21 04:45 GMT

ఓవర్ నైట్ రైజ్ అయ్యి తర్వాత మెల్లగా డౌన్ అయిన స్టార్ విజయ్ దేవరకొండ. అద్భుతమైన ప్రతిభ ఉన్నా.. సరైన విజయాలు లేక ఇబ్బందులు పడుతున్నాడు. బట్ ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ పడితే విజయ్ రేంజ్ మారిపోతుందని సినిమా విశ్లేషకులందరూ చెబుతారు. అలాంటి విజయం తనకు సితార బ్యానర్ నుంచి వస్తుందని గట్టిగా నమ్ముతున్నాడు విజయ్. ఆ బ్యానర్ లో ప్రస్తుతం తన కెరీర్ లో 12వ సినిమా చేస్తున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీని ఈ మార్చి 28న విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు మేకర్స్. బట్ అది సాధ్యం కావడం లేదని అర్థమైంది. అందుకే ఆ డేట్ కు అదే సమయంలో మార్చి 29న అదే బ్యానర్ లో రూపొందిన మ్యాడ్ 2 చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో అనఫీషియల్ గానే ఈ మూవీ పోస్ట్ పోన్ అయిందని అర్థమైంది. మరి కొత్త డేట్ ఎప్పుడా అని ఎదురుచూస్తోన్న విజయ్ ఫ్యాన్స్ కోసమే ఈ న్యూస్. వి.డి 12 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోందీ మూవీ. ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది.

ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ 'స్పై' పాత్రలో నటిస్తున్నాడు. ఓ పోలీస్ ఆఫీసర్ స్పై గా మారి క్లిష్టమైన కేస్ లను ఎలా పరిష్కరించాడు అనే కోణంలో కథనం సాగుతుందని టాక్. మొత్తంగా ఈ మూవీతో విజయ్ తో పాటు గౌతమ్ తిన్ననూరి కూడా నెక్ట్స్ లీగ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. 

Tags:    

Similar News