Vijay Devarakonda : కింగ్ డమ్ పోస్ట్ పోన్.. అంతా గజిబిజి

Update: 2025-06-10 10:15 GMT

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ కు వాయిదాల పర్వం కొనసాగుతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మొదట మే 30న విడుదల చేస్తాం అని ప్రకటించారు. ఆ టైమ్ రిలీజ్ చేయడం కుదరలేదు. ప్యాచ్ వర్క్ లు మిగిలిపోయాయి. కొన్ని రీ షూట్స్ పెట్టుకున్నారు. మరోవైపు ఎప్పట్లానే తెలుగు సినిమాలకు సంగీతం విషయంలో లేట్ చేస్తూ రిలీజ్ డేట్ లను ప్రభావితం చేస్తోన్న అనిరుధ్ వర్క్ కూడా పూర్తి కాలేదు. ఈ కారణంగా జూలై 4న విడుదల అని కొత్త డేట్ అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు ఆ డేట్ కు కూడా రావడం కష్టమే అని తేలిపోయింది. కొత్త డేట్ గా అదే నెలలో 25 అంటున్నారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. దీంతో ఈ నెలలో విడుదలయ్యే సినిమాల విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. అయితే కింగ్ డమ్ డేట్ కు హరిహర వీరమల్లు వస్తుందని చెప్పారు. సో.. ఇది కాస్త గిజిబిజీగా మారింది.

జూలై 4న నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ‘తమ్ముడు’మూవీ రాబోతోంది. కాంతార ఫేమ్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వాసిక ఫీమేల్ లీడ్స్ లో కనిపిస్తోన్న ఈ చిత్రంతో లయ నితిన్ కు ‘అక్క’గా రీ ఎంట్రీ ఇస్తోంది. తమ్ముడు రిలీజ్ డేట్ తో కింగ్ డమ్ వాయిదా కన్ఫార్మ్ అయింది. ఇక జూలై 11న అనుష్క, క్రిష్ కాంబోలో రూపొందిన ‘ఘాటీ’చిత్రం విడుదల కాబోతోంది. ఇది ముందుగా అనుకున్నదే. అయితే ఓటిటి రూల్స్ వల్ల రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందనుకున్నారు. బట్ అదే డేట్ కు ఘాటీ అలాగే ఇదే సమస్య వల్ల డౌట్ అనుకున్న తమ్ముడు జూలై 4న విడుదలుతున్నాయి.

సో.. కింగ్ డమ్ జూలై 25కు వాయిదా పడినట్టే అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ నెలలో ఏ డేట్ ఖాళీగా లేదు. అంచేత హరిహర వీరమల్లు ఎప్పుడు వస్తుందనే ప్రశ్న అలాగే ఉండిపోయింది. మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్ కోసం ఆగడం వల్ల ఆలస్యం అయిన ఈ మూవీ ఇప్పుడు అంతా పూర్తయినా రిలీజ్ డేట్ విషయంలో మల్లగుల్లాలు పడుతోందంటే కారణం ఏంటో అందరికీ తెలుసు. మరి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పవన్ స్వయంగా రంగంలోకి దిగుతాడా లేక.. నిర్మాతకే వదిలేస్తాడా అనేది చూడాలి.

Tags:    

Similar News