రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా సాహిబా అనే మ్యూజిక్ ఆల్బమ్ లో నటించాడు. ఇటీవలే ఈ ఆల్బమ్ రిలీజ్ అయ్యింది. ఈమేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రేమ గురించి విజయ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. "ప్రేమ అనేది అందరికి తప్పక పుడుతుంది. యంగ్ కుర్రాళ్లు మీరు ఇంకాస్త సమయం తీసుకోండి. బాయ్స్ ముందు జీవితంలో కాదు ఆలోచన విధానంలో కూడా ఎదగడం నేర్చుకోవాలి. అదేం తప్పు కాదు కదా. మరీ ముఖ్యంగా 30 ఇయర్స్ దాటిన బాయ్స్, 20 ఏళ్ల వయసు ఉన్న వారి కంటే కాస్త బెటర్ గా థింక్ చేస్తారు. ఆ వయసు ఉన్నప్పుడు ఆలోచనలు ఏవి స్థిరంగా ఉండవు. ఏది కూడా డిసైడ్ అవలేము. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందుకే టైమ్ కోసం ఎదురుచూడండి. దేనిని కూడా ఫోర్స్ చేయకండి” అని చెప్పుకొచ్చాడు విజయ్. దీంతో విజయ్ చేసిన ఈ కామెంట్స్ రష్మిక గురించే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.