Vijay Deverakonda : విజయ్ దేవరకొండతో బేబమ్మ

Update: 2024-11-21 14:15 GMT

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించనుందని తెలుస్తోంది. టాలీవుడ్ సమాచారం ప్రకారం.. వీడీ 12లో విజయ్ కి జోడీగా కృతి శెట్టిని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. గతంలో నేషనల్ క్రష్ రష్మిక మందాన ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినప్పటికీ ప్రస్తుతం రష్మిక ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరడం లేదట. దీంతో ఈ ఆఫర్ కృతి శెట్టి ని వరించిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కృతి శెట్టి ఉప్పెన తర్వాత రామ్ పోతినేని, నితిన్, నాగచైతన్య, తదితర స్టార్ హీరోలతో నటించినప్పటికే సరైన హిట్ పడలేదు. దీంతో టాలీవుడ్ లో ఆఫర్లు కరువయ్యాయి. మరి విజయ్ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి. ఇక పోతే విజయ్ దేవరకొండ నటించిన లైగర్, ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాలతో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాడు. దీంతో ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ కసిగా ప్రయత్నిస్తున్నాడు

Tags:    

Similar News