Vijay Deverakonda : రష్మికతో పెళ్లి.. నాన్సెన్స్ అన్న విజయ్
Vijay Deverakonda : ఈ క్రమంలో వాటిపైన పరోక్షంగా స్పందించాడు ఈ రౌడీ హీరో. ఎప్పటిలాగే నాన్సెన్స్. చెత్త వార్తలు అంటూ సీరియస్ గా ఓ పోస్ట్ పెట్టాడు విజయ్.;
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో ఇప్పుడు మంచి క్రేజ్ ఉన్న హీరో.. పట్టుమని పది సినిమాలు చేయలేదు కానీ మనోడికి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అయితే హీరోయిన్ రష్మిక మందన్నా, విజయ్ ప్రేమలో ఉన్నారని, ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారాని, ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్టుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ క్రమంలో వాటిపైన పరోక్షంగా స్పందించాడు ఈ రౌడీ హీరో. ఎప్పటిలాగే నాన్సెన్స్. చెత్త వార్తలు అంటూ సీరియస్ గా ఓ పోస్ట్ పెట్టాడు విజయ్. మొత్తానికి రష్మికతో ప్రేమ, పెళ్లి అంతా ఓ ఫేక్ అని చెప్పకనే చెప్పేశాడు విజయ్.. కాగా విజయ్, రష్మిక మొదటిసారి గీతాగోవిందం మూవీలో కలిసి నటించారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీలో ఈ జంట కలిసి నటించింది.
As usual nonsense..
— Vijay Deverakonda (@TheDeverakonda) February 21, 2022
Don't we just
❤️ da news!
అప్పటినినుంచి ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. కాగా ప్రస్తుతం విజయ్.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ షూటింగ్ ని కంప్లీట్ చేశాడు. శివనిర్వాణ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళి పనిలో ఉన్నాడు. అటు పుష్ప పార్ట్ 2పనుల్లో బిజీగా ఉంది రష్మిక.