Vijayasai Reddy: 'సర్కారు వారి పాట'కు విజయసాయి రెడ్డి రివ్యూ..
Vijayasai Reddy: పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ఈ గురువారం థియేటర్లలో విడుదలయ్యింది.;
Vijayasai Reddy: ఒకప్పుడు సినిమా, రాజకీయం రెండు వేర్వేరు రంగాలు. ఒక రంగంలోని అంశాల గురించి మరో రంగంలోని వారు అసలు మాట్లాడేవారు కూడా కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. సినిమాల గురించి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. అంతే కాదు స్టార్ హీరోల సినిమాలకు రివ్యూలు ఇస్తున్నారు కూడా. తాజాగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి కూడా మహేశ్ నటించిన 'సర్కారు వారి పాట' చూసి తమ అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' ఈ గురువారం థియేటర్లలో విడుదలయ్యింది. రెండున్నరేళ్ల తర్వాత మహేశ్ నుండి వచ్చిన సినిమా కావడంతో అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. ఇక చాలాకాలం తర్వాత మహేశ్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందంటూ టాక్ కూడా వినిపిస్తోంది. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.
వైసీపీ నేత విజయసాయి రెడ్డి ప్రత్యక్షంగా సినిమాలపై ఇప్పటివరకు పెద్దగా స్పందిందచలేదు. కానీ మహేశ్ నటించిన సర్కారు వారి పాట గురించి మాత్రం ఆయన ట్విటర్‌లో చెప్పుకొచ్చారు. 'పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు.' అంటూ సర్కారు వారి పాటను ప్రశంసించారు. ప్రస్తుతం ఆయన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట' బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 12, 2022
All the best to #MaheshBabu #wishes #greetings.