Vijayashanti : విజయశాంతి మాస్ వార్నింగ్

Update: 2025-04-19 10:31 GMT

సీనియర్ నటి విజయశాంతి మాస్ వార్నింగ్ వైరల్ గా మారింది. చాలాకాలం క్రితమే సినిమాలకు గ్యాప్ ఇచ్చింది విజయశాంతి. ఆ మధ్య మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు కోసం అనిల్ రావిపూడి ఒప్పించి రీ ఎంట్రీ ఇప్పించాడు. బట్ ఇది ఫ్యాన్స్ కు పెద్దగా కిక్ ఇవ్వలేదు. లేటెస్ట్ గా వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో మాత్రం ఆమె ఇమేజ్ కు తగ్గ పాత్రతో ఆకట్టుకున్నాడు దర్శకుడు ప్రదీప్ చిలుకూరి. విజయశాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది కర్తవ్యం. ఆ మూవీలో ఐపీఎస్ వైజయంతిగా అద్భుత నటన చూపించింది. అదే పాత్రను కంటిన్యూ చేస్తున్నారా అన్నట్టుగా ఈ మూవీలో కనిపించింది. తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ఓ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈమూవీకి మంచి రివ్యూస్ వస్తున్నాయి. లేటెస్ట్ గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ మీట్ లో విజయశాంతి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఈ సినిమా గురించి ఎమోషనల్ గా మాట్లాడింది విజయశాంతి. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభినందిస్తూ.. ఆకట్టుకున్నారు. హెయిర్ డ్రెస్సర్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్ వరకూ అందరి పేర్లూ చెబుతూ థ్యాంక్స్ చెప్పింది. అయితే సినిమాకు సంబంధించి కొందరు నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని అలాంటి వారిని క్షమించేది లేదని వార్నింగ్ ఇచ్చింది. సినిమా బావుంటే ఓకే. బాలేకపోతే చూడకండి.. అంతే కానీ పనికట్టుకుని నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల ఎంతోమంది జీవితాలు ఆగం అవతున్నాయి. అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాస్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే సినిమాలో కీలకమైన ఎపిసోడ్స్ ను కూడా ముందే చెప్పేస్తూ స్పాయిల్ చేస్తున్నారని వారినీ వదలనంటోంది.

సినిమా ఇండస్ట్రీని బతికించాలని కోరింది. అందరి సినిమాలు ఆడాలనే మేం కోరుకుంటాం అని.. ప్రతి హీరో అభిమానులూ అందరికీ సమానమే అన్నారు. మేం అంటే సీనియర్స్ అయిపోయాము.. పాపం కొత్తగా వచ్చే వాళ్లు కొందరు నెగెటివ్ మైండ్ సెట్ ఉన్నవారి వల్ల వారి కెరీర్, ఫ్యూచర్ ఆగం అవుతున్నాయని.. అలాంటి వారిని ఎట్టిపరిస్థితిలో వదిలపెట్టను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం వేదికపై ఉన్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియా నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Full View

Tags:    

Similar News