Vikrant Massey : తూఛ్.. నేను సినిమాలు మానేయడం లేదు

Update: 2024-12-03 08:54 GMT

ఈ మధ్య కాలంలో సెలెక్టివ్ మూవీస్ తో సత్తా చాటుతూ మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న బాలీవుడ్ యాక్టర్ విక్రాంత్ మాసే. రీసెంట్ గా ద సబర్మతి అనే మూవీతోనూ ఆకట్టుకున్న విక్రాంత్.. అంతకు ముందు 12త్ ఫెయిల్, సెక్టర్ 36, హసీనా దిల్ రూబా, ఫిర్ ఆయీ హసీనా మూవీస్ తో పాటు అనే టివి సీరియల్స్ లోనూ ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ను కూడా అందుకున్న విక్రాంత్ రీసెంట్ గా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ లెటర్ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ‘ఇన్నేళ్లుగా ఎంతో పనిచేశాను. ఇక ఓ తండ్రిగా, కొడుకుగా, భర్తగా ఇక ఇంటికి వెళ్లిపోతాను’ అనే టైప్ లో మనోడు ఓ లెటర్ పెట్టాడు. అంతే.. విక్రాంత్ సినిమాలు మానేస్తున్నాడు. రాబోయే రెండు సినిమాల తర్వాత అతను నటనకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు అనే న్యూస్ వచ్చేసింది. దీంతో ఇంత చిన్న వయసులో.. అదీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంత వరకూ కరెక్ట్ అంటూ విక్రాంత్ పై రకరకాల వార్తలు వచ్చాయి. పైగా పరుగు ఆపడం ఓ కళ అనే శోభన్ బాబు డైలాగ్స్ ను కూడా వాడేశారు.

అయితే ఈ తతంగం అంతా చూసిన విక్రాంత్.. తూఛ్.. నేను అలా అన్లేదు. సినిమాలు మానేయడం లేదు. మీరే తప్పుగా చదివారు అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. తను కేవలం ‘ఓ లాంగ్ బ్రేక్ కోరుకుంటున్నా’ అనే ఉద్దేశ్యంతో మాత్రమే ఆ పోస్ట్ పెట్టాను అని.. అది సినిమాలకే రిటైర్మెంట్ ప్రకటించినట్టుగా మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు అని క్లారిటీ ఇచ్చాడు.

అయితే ఇదంతా పిఆర్ స్టంట్ అంటూ కొందరు తోటి ఆర్టిస్టులే విమర్శలు చేస్తున్నారు. కేవలం మీడియా అటెన్షన్ కోసమే ఇలా చేశాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాటికి అతని సమాధానం ఏంటో కానీ.. మొత్తంగా నిజంగానే అతను రిటైర్ అవుతున్నాడనే వార్త దేశవ్యాప్తంగా పాపులర్ అయింది.

Tags:    

Similar News