గీతానంద్, మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా, శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘వర్జిన్ బాయ్స్’. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కు హాట్ ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూత్ కు విపరీతంగా కనెక్ట్ అయిందీ టీజర్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మించాడు.
వర్జిన్ బాయ్స్ టీజర్ చూస్తే యూత్‌ఫుల్ వైబ్స్, కలర్‌ఫుల్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. స్మరణ్ సాయి సంగీతం టీజర్‌కు జోష్‌ని జోడించగా, వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఫ్రెష్‌గా కనిపిస్తోంది. గీతానంద్, మిత్రా శర్మ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్‌తో కూడిన ఈ కథ, మోడ్రన్ రిలేషన్‌షిప్స్‌ను తమదైన స్టైల్‌లో చూపించనుందని తెలుస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహన్ క్యారెక్టర్, కామెడీ టైమింగ్ కి రెస్పాన్స్ బాగా వస్తుంది. ఈ సమ్మర్‌లో ‘వర్జిన్ బాయ్స్’ యూత్‌ను థియేటర్స్‌కు రప్పించే ఫుల్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ.. "ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దాం అన్నారు. గతంలో ఎన్నో మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లు వచ్చాయి. కానీ వాటిని మైమరిపించేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు. రొటీన్ కి భిన్నంగా ఈ సినిమా ఉంటుందన్నారు.ఈ సినిమా కచ్చితంగా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను" అన్నారు.