Vishal: పునీత్ రాజ్‌కుమార్ తరపున నేను చేస్తాను: విశాల్
Vishal: పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం వల్ల శాండిల్‌వుడ్‌లో ఎంతో అలజడి రేగింది.;
Vishal (tv5news.in)
Vishal: పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం వల్ల శాండిల్‌వుడ్‌లో ఎంతో అలజడి రేగింది. అప్పటివరకు తమతో సంతోషంగా గడిపిన సహ నటుడు ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. పునీత్ ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయనకంటూ సొంతంగా చాలా ట్రస్టులు కూడా ఉన్నాయి. వాటన్నింటి ద్వారా నిస్సహాయులకు ఎప్పుడూ అండగా నిలబడేవారు. పునీత్ మరణంతో ఆ ఛారిటీ పనులన్నీ అర్థాంతరంగా ఆగిపోతాయోమో అన్న సమంయలో ఓ హీరో నేనున్నాను అంటూ ముందుకొచ్చారు.
విశాల్.. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఈయన ఆఫ్ స్క్రీన్ కూడా హీరోనే. ఇప్పటివరకు ఎంతోమంది నిస్సహాయులకు ఎన్నో రకాలుగా సాయం చేశారు విశాల్. ఇప్పటికీ రైతులకు ఆయన చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. అందుకే విశాల్ అంటే సౌత్ ప్రేక్షకులకు చాలా ఇష్టం. తాజాగా విశాల్ తీసుకున్న ఒక నిర్ణయం విని ప్రేక్షకులంతా శభాష్ అంటున్నారు.
పునీత్ 1800 మంది పిల్లలను చేరదీసి వారి చదువుకు కావాల్సిన పూర్తి ఖర్చులను ఆయనే చూసుకుంటున్నారు. ఆయన అకాల మరణం వల్ల ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అందుకే విశాల్ ముందుకొచ్చి ఆ 1800 పిల్లలను చదివించే బాధ్యత ఇకపై తనదేనంటూ మాటిచ్చారు. పునీత్ మొదటుపెట్టిన ఈ మహాకార్యినికి తనకు చాలా గర్వంగా ఉందని విశాల్ అన్నారు. 'ఆయన మొదలుపెట్టిన దాన్ని నేను కొనసాగిస్తాను. ఆయన తరపున ఆ పిల్లలను ఇకపై నేను చదివిస్తాను' అన్నారు విశాల్.
ఇటీవల తన అప్‌కమింగ్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాల్ అన్న ఈ మాటలకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ఒక మంచి మనిషి మొదలుపెట్టిన కార్యాన్ని మరో మంచి మనిషి ముందుకు తీసుకెళ్తానంటున్నారు అని నెటిజన్లు విశాల్‌పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.