Vishnu Manchu : కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ ఇదేనా

Update: 2025-04-09 11:00 GMT

మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటించి నిర్మించిన సినిమా ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని రప్పించాడు విష్ణు. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ద ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులైన ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి వారిని ఈ మూవీ కోసం తీసుకున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేస్తాం అని ప్రకటించారు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు.

కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కు ఫైనల్ గా ఆ డేట్ చెప్పేశారు. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాలనుకుంటున్నారని టాక్. ఈ మాట తాజాగా మోహన్ బాబు, విష్ణు తో పాటు టీమ్ అంతా ఉత్తరప్రదేశ్ సిఎమ్ ఆదిత్యనాథ్ ను కలిసినప్పుడు చెప్పారట. అలా ఈ డేట్ బయటకు వచ్చింది. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతోన్న ఈ కథలో అనేక మార్పులు కూడా చేశారని ఆరంభం నుంచి వస్తోన్న అప్డేట్స్ చూస్తే తెలుస్తుంది. మొత్తంగా కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ ఫైనల్ అయినట్టే అంటున్నారు.

Tags:    

Similar News