Vishwaksen : విశ్వక్ సేన్ లైలా మూవీ టీజర్ ఎలా ఉంది

Update: 2025-01-17 13:21 GMT

యంగ్ స్టార్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ లైలా. ఆకాంక్ష శర్మ హీరోయిన్.Akanksha Sharma | Ram Narayan | Leon James ఇందులో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడని అనౌన్స్ మెంట్ టైమ్ లోనే చెప్పారు. అంటే డ్యూయొల్ రోల్ లో మేల్ అండ్ ఫీమేల్ అతనే ఉండబోతున్నాడు. చాలా రోజులుగా ఈ మూవీ గురించి వినిపిస్తోంది. తాజాగా వచ్చిన టీజర్ చూస్తే విశ్వక్ సేన్ నుంచి మరో ప్రామిసింగ్ మూవీ రాబోతోందని అర్థం అవుతోంది. టీజర్ మొత్తం హీరోనే కనిపిస్తున్నాడు. అఫ్ కోర్స్ అతని లేడీ గెటప్ కూడా.

టీజర్ చూస్తే.. ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఆడవాళ్లకు అందంగా మేకప్ వేయడంలో సోనూ ఎక్స్ పర్ట్. అతని వల్ల ఆడవాళ్లంతా మగవాళ్లను ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి సోనూను ఏసేయాలని ప్రయత్నాలూ చేస్తారు. కానీ మనోడికి ‘తెల్లగ జేసుడే కాదు.. తోలు తీసుడుగూడ వొచ్చు’ అందుకే వాళ్లూ మరో ప్రయత్నం చేస్తే ఏమంటడంటే.. ‘ఇంగెపార్ సికిందరబాద్.. ఒక్కొక్కడ్ని చిలకలు కోసి చీరలు కట్టి పంపిస్తా అర్థమైతుందా’.. అన్నడు. అంతే మనోడితోని విధి వింతనాటకం ఆడేసింది.

కట్ చేస్తే లేడీ గెటప్. ఆ గెటప్ లోనూ విశ్వక్ సేన్ చాలా బావున్నాడు. బాడీ లాంగ్వేజ్ బానే మెయిన్టేన్ చేశాడని తెలుస్తుంది. ఈ గెటప్ లో కూడా కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి.. ‘నేను కార్లో వస్తుంటే లైసెన్స్ అడిగిండు.. లైసెన్స్ లేదు ఇంట్లో ఉందంటే.. కార్ ఎక్కూ అన్నడు.. కార్ ఎక్కినక్క మీద చెయ్యే అమ్మో సైలెన్సర్ పట్టుకుండు’.. అంటూ మెలికలు తిరిగిపోతూ చెప్పిన డైలాగ్ నవ్వించేలా ఉంది.

మొత్తంగా చూస్తే టీజర్ చాలా బావుంది. మంచి ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనేలా ఉంది. విశ్వక్ సేన్ నుంచి మరో వైవిధ్యమైన సినిమాగా కనిపిస్తోంది. ఇలాగే ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉంటే సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయి. కంటెంట్ మెప్పిస్తే హిట్ టాక్ ఇచ్చేస్తరు ఆడియన్స్.

సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని రామ్ నారాయణ డైరెక్ట్ చేస్తున్నాడు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించాడు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతోందీ లైలా.

Full View

Tags:    

Similar News