Viswak Sen : పృథ్వీ కోసం మమ్మల్ని బలి చేయకండి

Update: 2025-02-10 10:31 GMT

నోరు బావుంటే ఊరు బావుంటుంది అంటారు. కొన్నిసార్లు ఎవరో చేసిన తప్పిదం వల్ల ఇంకెవరో ఇబ్బంది పడుతుంటారు. సరిగ్గా ఇది అప్లై అవుతుంది లైలా మూవీ టీమ్ కు. విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ డైరెక్ట్ చేసిన లైలా చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించాడు. టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ గా 14న లైలా విడుదల కాబోతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ ఏపిలో రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అతను ఎక్కువ సేపు మాట్లాడలేదు కానీ.. మాట్లాడిన నాలుగు మాటల్లోనూ రాజకీయ పరమైన ఉద్దేశ్యాలు కనిపించాయి. అందువల్ల 'బాయ్ కాట్ లైలా' అంటూ సోషల్ మీడియాలో వేలాది పోస్ట్ లు కనిపిస్తున్నాయి. ఇంతకీ పృథ్వీరాజ్ ఏం మాట్లాడాడు అంటే.. 'నేను సినిమాలో అభిమన్యు సింగ్ కు అపోజిట్ గా నటించాను. సినిమా మొదట్లో కొన్ని గొర్రెలు ఉంటాయి. అవి మొత్తం ఎన్ని అంటే ఎవరో వచ్చి.. 80, 70 మొత్తం 150 అన్నారు. షూటింగ్ చివరికి వచ్చిన తర్వాత గొర్రెలు తగ్గాయి. అప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే 11 అన్నారు. ఇది యాధృచ్ఛికంగా జరిగింది. కానీ మాకు బావుంది" అన్న తరహాలో మాట్లాడాడు. ఇది వైఎస్ఆర్సీపీ వారిని ఉద్దేశించే అన్నాడు అంటూ ఆ పార్టీ వాళ్లు బాయ్ కాట్ లైలా అంటూ హ్యాష్ ట్యాగ్స్ మొదలుపెట్టారు. ఇది సినిమాకు ప్రమాదం అని భావించిన టీమ్ వెంటనే అలెర్ట్ అయింది.

తాజాగా పృథ్వీరాజ్ కమెంట్స్ గురించి నిర్మాత, హీరో ప్రెస్ మీట్ పెట్టారు. బాయికాట్ లైలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం చూసి షాక్ కి గురయ్యాము

"అది మా నోటీస్ లో జరుగలేదు. సినిమాని అందరూ సినిమా గా చూడండి.గెస్ట్ లుగా వచ్చిన వాళ్ళు ఏమి మాట్లాడతారో మాకు తెలీదు. దయచేసి ఒక వ్యక్తి మాట్లాడిన దానికి సినిమాను బలి చేయొద్దు" అన్నారు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.."అతను మాట్లాడిన దానికి సినిమాకు సంబంధంలేదు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియా లో వేల ట్వీట్స్ అంటే ఎలా సినిమా బ్రతకాలా లేదా..? వీడి ఖాతాలో ఇంకోడు బలి అంటూ ట్వీట్స్ వేస్తున్నారు. ఆ ఒక్కడి మాటల వల్ల 25 వేల ట్వీట్స్ వేశారు. రిలీజ్ డే మార్నింగ్ షో కు హెచ్.డి ప్రింట్ పెడతాం అంటున్నారు.100లో ఒక్కరు తప్పు చేస్తే 99 మందికి పనిష్మెంట్ ఇస్తారా..? మేము చిరంజీవి గారిని రిసీవ్ చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు అతను మాట్లాడాడు. మా కంట్రోల్ లో జరుగలేదు.చాలా కష్టపడి తీసాము సినిమా . నేను ఈ వివాదం గురించి ఇంతటితో ముగిస్తున్నాను.మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు.." అన్నాడు. బట్ ఈ గొడవ ఇంత ఈజీగా ముగిసిపోతుందనుకోలేం.

కొన్నాళ్లుగా పృథ్వీరాజ్ అసందర్భంగా అనేక సార్లు వైసీపిపై కౌంటర్స్ వేస్తున్నాడు. అవి రాజకీయ వేదికలైతే ఫర్వాలేదు. కానీ ఇలా సినిమా ఫంక్షన్స్ లోనూ, ఇతర వేదికలపైనా కామెంట్స్ చేస్తే ఆ సమస్య వీరికి చుట్టుకుంటుంది. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఏదేమైనా సాహు గారపాటి, విశ్వక్ సేన్ వివరణతో 'బాయ్ కాట్ లైలా' నినాదాలు ఆగుతాయా లేదా అనేది చూడాలి. 

 

Tags:    

Similar News