Laila Movie Review : విశ్వక్ సేన్ లైలా హిట్టా ఫట్టా

Update: 2025-02-14 09:30 GMT

రివ్యూ : లైలారివ్యూ : లైలా

తారాగణం : విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ, అభిమన్యు సింగ్, బబ్లూ పృథ్వీరాజ్, 30 ఇయర్స్ పృథ్వీరాజ్ తదితరులు

ఎడిటర్ : సాగర్ దాడి

సంగీతం : లియోన్ జేమ్స్

సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ప్రసాద్

నిర్మాత : సాహు గారపాటి

దర్శకత్వం : రామ్ నారాయణ్

కమెడియన్స్ లేడీ గెటప్పులు వేస్తే నవ్వుకుంటాం. హీరోలు లేడీ గెటప్ లు వేస్తే.. డిఫరెంట్ కంటెంట్ ఉంటుందనుకుంటాం. అయితే ఈ మధ్య లేడీ గెటప్ లు కేవలం జబర్దస్త్ కే పరిమితం అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో విశ్వక్ సేన్ లేడీ గెటప్ తో లైలా అనే టైటిల్ తో వస్తున్నట్టు అనౌన్స్ చేసినప్పుడు ఆసక్తిగానే చూశారు. రిలీజ్ కు ముందు కాంట్రవర్శీ సినిమాకు ప్లస్ అవుతుందనే ఎక్కువమంది అనుకున్నారు. ఫైనల్ గా ఈ వేలైంటన్స్ డే రోజు విడుదలైన లైలా ఎలా ఉందో చూద్దాం.

కథ :

సోనూ( విశ్వక్ సేన్) ఓల్డ్ సిటీ ఏరియాలో పాపులర్ మేకప్ ఆర్టిస్ట్. అతని మేకప్ కు మహిళలంతా వీరాభిమానులవుతారు. తన కస్టమర్స్ లో ఒకరికి ఆపద వస్తే తన పేరుతో మార్కెటింగ్ చేసుకోమని డబ్బులు కూడా ఇస్తాడు. రుస్తుం(అభిమన్యు సింగ్) లోకల్ గా మీట్ బిజినెస్ చేసే చిన్న రౌడీ. పెళ్లి కోసం చూస్తుంటాడు. ఒక నల్లమ్మాయికి సోనూ వేసిన మేకప్ చూసి మోసపోయిన రుస్తుం ఆమెని పెళ్లి చేసుకుంటాడు. శోభనం తర్వాత ఆమె అసలు రంగు బయటపడుతుంది. అందుకు కారణం రుస్తుం అని అతన్ని చంపాలనుకుంటాడు. ఇక లోకల్ ఎస్ భార్య కాకుండా మరోక లేడీని మెయిన్టేన్ చేస్తున్నాడనే విషయం బయటపెడతాడు సోనూ. దీంతో ఎస్ఐ కూడా అతన్ని టార్గెట్ చేస్తాడు. ఇటు ఆ ఏరియాలో ఆడవారి భర్తలంతా సోనూ పై కోపం గా ఉంటారు. తన పేరుతో మార్కెటింగ్ చేసిన లేడీ అమ్మిన ఆయిల్ వల్ల చాలామంది హాస్పిటల్ పాలవుతారు. ఆ కేస్ సోనూపైకి వస్తుంది. మరి ఈ కేస్ నుంచి అతనెలా బయటపడ్డాడు. తన కోసం చూస్తోన్న ఎస్ఐ, రుస్తుం నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ :

ఇలాంటి కథలను విశ్లేషిస్తే సింపుల్ గా అవుట్ డేటెడ్ అని చెప్పాల్సి ఉంటుంది. చూస్తున్నంత సేపూ అసలు సినిమాలో ఇది బావుంది అని చెప్పడానికి ఒక్క సీన్ కూడా లేకుండా బలే తీశారు అనిపిస్తుంది. అంతలా బోర్ కొట్టిస్తుంది లైలా. ఆరంభం నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తదనం ఉన్న సన్నివేశం కనిపించదు. అంత అవుట్ డేటెడ్ స్టోరీ లైన్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఇది. తనపై వచ్చిన అపవాదును తొలగించుకోవడానికి, తనను అటాక్ చేస్తున్నవారి నుంచి తప్పించుకోవడానికి లేడీ గెటప్ వేసుకున్న ఓ మేకప్ ఆర్టిస్ట్.. తన ‘బత్తాయి సోయగాల’తో వారినే బురిడీ కొట్టించడం.. ఇదీ పాయింట్. ఈ పాయింట్ కోసం విశ్వక్ సేన్ అన్ని రోజులు లేడీ గెటప్ తో కనిపించి టైమ్ వేస్ట్ చేసుకున్నాడా అనిపిస్తుంది. ఒకవేళ ఈ గెటప్ వేస్తే అందుకో ఎమోషన్ ఉండాలి.. వినోదమూ సెట్ కావాలి. ఈ రెండూ పూర్తిగా మిస్ అయ్యాయీ సినిమాలో. ఇక హీరోయిన్ తో లవ్ ట్రాక్ అయితే 90ల కాలానికే పాతది అనిపించుకుంటుంది. కేవలం ఆమె శరీర సౌష్టవం చూపించడానికే అన్నట్టుగా ఓ పాటంతా బికినీలోనే లాగించారు. అంటే అందాల ప్రదర్శన విశ్వక్ చేస్తే బావుండదు కాబట్టి ఆమెతో చేయించారు తప్ప ఆ హీరోయిన్ ఇంపార్టెన్స్ లేదు. లవ్ స్టోరీలో దమ్ములేదు.

చీప్ డైలాగ్స్, బోలెడన్నీ డబుల్ మీనింగ్స్, అర్థం పర్థం లేని విలనిజం. డిజే టిల్లును చూసి వాతలు పెట్టుకున్నట్టుగా ఆఖర్లో ఓ ఆడ జడ్జితో కోర్ట్ సీన్. చిరాకు తెప్పిస్తుందీ సీన్ కూడా. విశ్వక్ సేన్ ఈ కథ గురించి, సినిమా గురించి ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. కానీ ఈ కథ, కథనాల్లో అస్సలే మాత్రం కొత్తదనం లేదు. మరి ఏం ఎక్స్ పెక్ట్ చేసి ఇంత రిస్క్ చేశాడో కానీ.. విశ్వక్ సేన్ ఆశించిన రిజల్ట్ అయితే రాకపోవచ్చు. ఇంకా చెబితే ఈ మూవీ అతని కెరీర్ లో ఓ మచ్చగానూ చెప్పే అవకాశాలున్నాయి.

నటన పరంగా చూస్తే ఒక్క లేడీ గెటప్ తప్ప విశ్వక్ సేన్ కూడా ఏ కొత్తదనం లేని నటనతోనే కనిపించాడు. రుస్తుంగా నటించిన అభిమన్యు సింగ్ ఆకట్టుకుంటాడు. నల్లటి అమ్మాయిగా మేకప్ వేసుకున్న కామాక్షి పాత్రతో నల్లగా ఉండే వారిని అవమానించారు మేకర్స్. హీరోయిన్ ఎసెట్స్ చూపించడానికే తప్ప ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడానికి కాదు అన్నట్టుగా తన పాత్రను రూపొందించారు. మిగతా పాత్రలన్నీ పరమ రొటీన్. వారి నటనా అంతే.

టెక్నికల్ గా కూడా ఏమంత గొప్పగా లేదు. ఉన్నంతలో సినిమాటోగ్రఫీ బావుంది. మ్యూజిక్ అస్సలు బాలేదు. విశ్వక్ సేన్ పాత్రకు తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నా.. వంటకం బాలేనప్పుడు ఎంత అందమైన పాత్రలో పెడితే మాత్రం ఏం లాభం.

దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వ లోపం ప్రతి సీన్ లో కనిపిస్తుంది. కొత్తదనం ఎక్కువగా కోరుకుంటోన్న ప్రేక్షకుల కాలంలో ఇలాంటి సినిమాతో రావడం ఆశ్చర్యం. ఇక రచయితగా కార్డ్ పడిన వాసుదేవ మూర్తి ఏం చెప్పి వీరిని కన్విన్స్ చేశాడో కానీ.. పూర్తిగా అవుట్ డేటెడ్ కంటెంట్ ఇచ్చాడు వీరికి.

ఫైనల్ గా : పరమ బోరింగ్ సినిమా

రేటింగ్ : 1.5/5

- బాబురావు. కామళ్ల

Tags:    

Similar News