మెగాస్టార్ చిరంజీవి మూవీ అంటే ఇప్పటికీ ఫ్యాన్స్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఈ ఏజ్ లో కూడా ఉరకలెత్తే ఉత్సాహంతో స్టెప్పులు వేస్తున్నాడు.. యాక్షన్ చేస్తున్నాడు. ఇక ఆయన నటించిన విశ్వంభర మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ అస్సలు బాలేదు అనే ఫీడ్ బ్యాక్ టీజర్ తోనే రావడంతో సినిమాను ఆపేశారు. మళ్లీ మొదటి నుంచీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వర్క్స్ ను చేయిస్తున్నారు. ఇందుకోసం బడ్జెట్ పెరిగినా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ తగ్గడం లేదు. బెస్ట్ అవుట్ పుట్ నే ఇవ్వాలనుకుంది. అందుకే బాగా ఆలస్యం అవుతోంది. అయితే అభిమానులు మాత్రం ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అప్డేట్స్ కోసం చూస్తున్నారు. వారి కోసం మెగాస్టార్ స్వయంగా రంగంలోకి దిగాడు.
విశ్వంభర చిత్రాన్ని వచ్చే యేడాది వేసవిలో విడుదల చేయబోతున్నాం అని ప్రకటించాడు. తనే ఓ వీడియో చేస్తూ ఈ మూవీ ఆలస్యానికి కారణం విజువల్ ఎఫెక్ట్స్ ను మళ్లీ చేయిస్తుండటమే అని చెప్పాడు. సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ తోనే ఉంటుందట. అందుకే బెస్ట్ క్వాలిటీని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇంత టైమ్ తీసుకుంటున్నాం అని చెప్పాడు. ఇక ఈమూవీ పిల్లలతో పాటు వయసైపోయిన పెద్దవాళ్లలో ఉండే పిల్లలకూ బాగా నచ్చుతుందని చెప్పాడు.అయితే ఈ శుక్రవారం తన బర్త్ డే సందర్భంగా గురువారం సాయంత్రం విశ్వంభర నుంచి ఓ గ్లింప్స్ ను విడుదల చేస్తున్నాం అని కూడా అప్డేట్ ఇచ్చాడు మెగాస్టార్.
మొత్తంగా విశ్వంభర ఈ యేడాది విడుదల కావడం లేదు. అయితే సంక్రాంతికి మాత్రం అనిల్ రావిపూడి మూవీ వస్తుంది. ఆ తర్వాతే విశ్వంభర ఉంటుంది. ఇక బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేసిన ఈచిత్రంలో త్రిష, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో నటించారు. కీరవాణి సంగీతం అందించాడు.