మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా రూపొందిన సినిమా వార్ 2. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముందు నుంచీ అందరూ ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర చేస్తున్నాడు అనుకున్నారు. కానీ ఆ పాత్ర హృతిక్ రోషన్ చేస్తున్నాడని ట్రైలర్ చూశాక అర్థమైంది. ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేలా కట్ చేశారు ట్రైలర్. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించారు అంటే ఖచ్చితంగా కాంపిటీషన్ స్ట్రాంగ్ గానే ఉంటుంది. అది సిల్వర్ స్క్రీన్ పైనా ఉంటుందనేలా ఉంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గరకు వస్తోంది. ప్రమోషనల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేసుకుంటోంది టీమ్. ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ముంబైతో పాటు తమిళనాడు, కేరళ, బెంగళూరు, తెలుగు స్టేట్స్ లో కూడా ఈవెంట్స్ చేయాలి. మరి వీరు అలా అన్ని చోట్లా ప్లాన్ చేసుకున్నారా లేదా ఇంకా అప్డేట్ లేదు కానీ.. తెలుగు స్టేట్స్ వరకూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం కుదిరింది. ఆగస్ట్ 10 విజయవాడలో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఈవెంట్ జరగలేదు అనే స్థాయిలో భారీగా నిర్వహించబోతున్నారు అని టాక్. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ రోషన్ అలాగే మెయిన్ టీమ్ అంతా అటెండ్ అవుతారట.