NTR, Hrithik : ఎన్టీఆర్, హృతిక్ స్టెప్స్ షురూ..

Update: 2025-07-01 09:19 GMT

ఈ డెకేడ్ పాటలు, స్టెప్స్ అనగానే గుర్తొచ్చే పాట, స్టెప్పులు నాటు నాటు మాత్రమే. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన డ్యాన్స్ లు ప్రపంచాన్నే ఊపేశాయి. ఆ రేంజ్ లో కంపోజ్ చేయించాడు దర్శకుడు రాజమౌళి. ఇద్దరు మాస్ హీరోలు.. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలతో మల్టీ స్టారర్ అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకున్నాడు రాజమౌళి. ఇప్పుడు మరోసారి ఆ రేంజ్ ఉన్న హీరోల మధ్య పాట అంటే ఖచ్చితంగా నాటు నాటును మించి ఎక్స్ పెక్ట్ చేస్తారు. కనీసం దానికి తగ్గకుండా కూడా చూసుకోవాలి. అందుకే వార్ 2 కోసం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల మధ్య నాటు నాటు తరహా సాంగ్ అనగానే అంతా ఆసక్తిగా చూస్తున్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. కేవలం ఈ పాట మాత్రమే బ్యాలన్స్ ఉంది. మార్చి లోనే షూట్ అనుకున్నారు. బట్ ప్రాక్టీస్ లో హృతిక్ రోషన్ కాలు బెణకడంతో రెస్ట్ అవసరం అన్నారు. ఆ కారణంగా ఆలస్యం అయింది.

ఇక ఈ పాట షూటింగ్ ఈ మంగళవారం నుంచి ప్రారంభం అవుతోంది. ఇప్పటికే ఇద్దరు హీరోలు సింక్ మిస్ అవకుండా ఉండేందుకు కొన్నాళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారట. దీంతో సెట్స్ లో ఇబ్బంది లేకుండా స్టెప్పులతో అదరగొట్టేయొచ్చు. మామూలుగా ఎన్టీఆర్ కు ప్రాక్టీస్ అవసరం లేదు అంటారు. మరో హీరో కూడా ఉన్నప్పుడు ఇబ్బంది ఉండకూడదు అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉండాలి. ఇద్దరి మధ్య కరెక్ట్ కో ఆర్డినేషన్ ఉంటేనే ఇలాంటి పాటలు బ్లాక్ బస్టర్ అవుతాయి. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకునే ఈ పాట చిత్రీకరణ మొదలుపెట్టారు.

కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోన్న ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై వర్స్ లో భాగంగా రూపొందిస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

Tags:    

Similar News