WAR 2 : వార్ 2 ట్రైలర్ విడుదల...నెక్స్ట్ లెవెల్లో యాక్షన్ సీక్వెన్స్...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుంది. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ కీలక పాత్రలో కనిపించనుంది.
నేను ప్రమాణం చేస్తున్నాను అని ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌లో ఇద్దరు హీరోల నేపథ్యం చెప్పారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో సినిమా రూపొందించారు. దారులు వేరు అయిన దేశమే ప్రధానం అనే కథాంశంతో మూవీ ఉన్నట్లుగా అర్దం అవుతుంది. ఇక హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమా కి హైలెట్ గా నిలవనున్నాయి. మాములు హీరోయిన్‌లా కాకుండా కియారా కూడా కీలక రోల్ లో నటించింది.
కాగా 2025 మే 20 న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లు తారక్ అండ్ హృతిక్ అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు సినిమా పై భారీ అంచనాలను పెంచాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లుగా చెప్తోంది. దీంతో ఆగస్టు 14 కోసం వెయిట్ చేస్తున్నారు సినీ లవర్స్...