Vikram Prabhu : ఆ హీరో తెలుగు డెబ్యూ నిరాశపరిచినట్టేనా

Update: 2025-09-08 09:09 GMT

కోలీవుడ్ హీరోల్లో చాలామందికి తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకోవాలనే ఉంటుంది. అయితే డైరెక్ట్ గా తెలుగు మూవీతో ఇక్కడ డెబ్యూ ఇచ్చే అవకాశం కొందరికే వస్తుంది. ఆ టైమ్ లో వారికి చాలా హోప్స్ ఉంటాయి. ఈ మూవీ హిట్ అయితే తన తర్వాతి డబ్బింగ్ మూవీస్ కు క్రేజ్ ఉంటుందనే అంచనాలుంటాయి. ఆ అంచనాలతోనే క్రిష్ ను నమ్మాడు విక్రమ్ ప్రభు. కోలీవుడ్ లెజెండరీ యాక్టర్ శివాజీ గణేశన్ మనవడు, సీనియర్ నటుడు ప్రభు తనయుడుగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విక్రమ్ ప్రభు కెరీర్ ఆశించినంత గొప్పగా సాగడం లేదు అనే చెప్పాలి. కానీ కొన్ని సినిమాలు మాత్రం హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయి. కంటెంట్ బేస్డ్ మూవీస్ తో కొన్నిసార్లు ఆకట్టుకుంటాడు. అతను తెలుగులో ఘాటీతో ఎంట్రీ ఇచ్చాడు.

అనుష్కకు జోడీగా దేశిరాజు పాత్రలో విక్రమ్ ప్రభు ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సెటిల్డ్ గా నటించాడు. అయితే ఆ పాత్రలోని నేటివిటీ మిస్ అయ్యేలా కనిపించిన డబ్బింగ్ ఆకట్టుకోలేదు. అయినా అతను ఉన్నంత సేపూ సినిమా బావుందనే టాక్ వినిపించింది. ఇంటర్వెల్ లో చనిపోవడంతో ఆ పాత్ర ముగుస్తుంది. బట్ సినిమాకు గొప్ప రివ్యూస్ రాలేదు. మాగ్జిమం పోయింది అనే చెప్పుకున్నారు. దీంతో ఎన్నో హోప్స్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన విక్రమ్ ప్రభుకు నిరాశే ఎదురైంది. ఇలాంటి మూవీస్ లోని నటనతో ఎక్కువమందిని ఆకట్టుకోవచ్చు.కానీ అతను తెలుగువారికి పెద్దగా తెలియకపోవడంతో కొంత మైనస్ అయింది. ఏదేమైనా విక్రమ్ ప్రభు తెలుగు తెరంగేట్రం అతన్ని బాగానే డిజప్పాయింట్ చేసి ఉంటుందనుకోవచ్చు.

Tags:    

Similar News