Naga Chaitanya : ఆ క్షణాలను వాళ్లతో కలిసి మళ్లీ ఆస్వాదించాలి : నాగచైతన్య

Update: 2024-12-07 11:00 GMT

అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహం ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఈక్రమంలో రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షోలో తన ఫ్యామిలీ, సినీ లైఫ్ గురించి ఆసక్తికర విషయా లను పంచుకున్నారు. “నాకు 50 ఏళ్లు వయసు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నా. (మధ్యలో రానా కలగజేసుకుని ఏంటి.. వెంకీమామలా ముగ్గురు, నలుగురు కావాలా) ఒకరిద్దరు చాలు. వెంకీమామది పెద్ద కుటుంబం. నాకు కొడుకు పుడితే వాడిని రేస్ ట్రాక్కు తీసుకెళ్తా. కూతురు పుడితే, తనకు ఎలాంటి హాబీలు ఉంటాయో వాటిని గుర్తించి ప్రోత్సహిస్తా. నాకు వాళ్లతో ఎక్కువ సమయం గడపాలని ఉంది. మనం చిన్నప్పుడు పిల్లలుగా కొన్ని క్షణాలు ఎంజాయ్ చేశాం. ఆ క్షణాలను వాళ్లతో కలిసి మళ్లీ ఆస్వాదించా లని ఉంది” అంటూ నాగచైత న్య సమాధానం ఇచ్చాడు.

Tags:    

Similar News