‘రెహ్నా హై తేరే దిల్ మే’మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ దియా మీర్జా. అనంతరం వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ఇక 2021లో విడుదలైన 'వైల్డ్ డాగ్' తెలుగు చిత్రంలోనూ ఈభామ నటించింది. ఓవైపు హీరోయిన్గా, మోడల్ గా సమాజ సేవకురాలిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈముద్దుగుమ్మకు 2012లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ 'గ్రీన్ అవార్డు' వచ్చింది. అయితే తాజాగా తన లైఫ్ జర్నీపై దియా ఆసక్తికరవిషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. మోడలింగ్లోకి అడుగుపెట్టిన సమయంలో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు గుర్తుచేసు కుంది. మోడలింగ్లోకి వెళ్తానని చెబితే.. ఫ్యామిలీ నుంచి అంతగా సపోర్ట్ అందలేదు. అయినా కూడా నా లక్ష్యం వైపే అడుగులు వేశాను. 2000లో నాతో పాటు ప్రియాంక చోప్రా, లారా దత్తా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నం. ప్రియాంకకు ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉండేది. మాకు ఎవరూ సహకరించ లేదు. ముంబైలో లారా ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉండేది. నేను ముంబై వెళ్లిన ప్రతిసారి ఆమె ఇంట్లోనే ఉండేదాన్ని. డబ్బులు ఉండేవి కాదు. ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి ఖరీదైన బట్టలు కొనేవాళ్లం కానీ.. తినడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండేది కాదు. ఆకలి తీర్చుకోవడం కోసం నూడుల్స్ తినేవాళ్లం. మా పరిస్థితి తలుచుకొని మేమే నవ్వుకునే వాళ్లం. ఖరీదైన దుస్తులు వేసుకున్నా.. తినేది మాత్రం నూడుల్స్ అనుకునేవాళ్లం' అంటూ దియా ఎమోషనల్ అయ్యింది. కాగా.. 2000 మిస్ ఇండియా పోటీల్లో లారా దత్తా విజేతగా కిరీటాన్ని అందుకోగా.. ఫస్ట్ రన్నరప్ గా ప్రియాంకా చోప్రా, సెకండ్ రన్నరప్ దియా మీర్జా నిలిచారు.