Allu Arjun Family : చిరంజీవి, నాగబాబుతో అల్లు అర్జున్-స్నేహా రెడ్డి ఏం మాట్లాడారంటే?
హీరో అల్లు అర్జున్ ఆదివారం మెగా సోదరుల ఇంటికి వెళ్లారు. అల్లు అర్జున్ ఆదివారం ఉదయం చిరంజీవి ఇంటికి, సాయంత్రం నాగబాబు ఇంటికి తన భార్య స్నేహారెడ్డితో కలిసి వెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అరెస్ట్ పరిణామాలపై చిరంజీవి, నాగబాబులతో బన్నీ సుమారు 3గంటల పాటు చర్చించారు. తొలత అల్లు అర్జున్ సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ లంచ్ చేసిన అనంతరం నాగబాబు ఇంటికి వెళ్లారు. తన ఇంటికి విచ్చేసిన అల్లు అర్జున్ దంపతులకు నాగబాబు సాదర స్వాగతం పలికారు. అల్లు అర్జున్ ను ఆత్మీయంగా హత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. కష్ట సమయంలో మెగా ఫ్యామిలీ అండగా నిలవడం పట్ల బన్నీ కృతజ్ఞతలు తెలియజేసినట్లు తెలిసింది. మరోవైపు పవన్ కల్యాణ్ మాత్రం అల్లు అర్జున్ ను కలవకుండానే హైదరాబాద్ నుంచి నేరుగా ఏపీకి వెళ్లినట్లు సమాచారం. జైలు నుంచి విడుదలైన తరువాత బన్నీ ఇంటికి సెలెబ్రిటీలు క్యూ కట్టారు. మరుసటి రోజు అల్లు అర్జున్ స్వయంగా తన రేంజ్ రోవర్ కారును నడుపుకుంటూ చిరంజీవి, నాగబాబు ఇంటికెళ్లి రాత్రి వరకు అక్కడే గడిపారు. తాజా పరిణామాలపై బన్నీ మెగాస్టార్, నాగబాబులతో చర్చించారు. కాగా చిరంజీవిని కలిసేందుకు అల్లు ఫ్యామిలీ అంతా వెళ్లినట్లు బన్నీ పీఆర్ టీం ఓ ప్రకటనలో తెలిపింది.