Shruti Haasan : భవిష్యత్తు ఎలాంటిది తీసుకొచ్చినా దానిపై ఆధార పడాల్సిందే

Update: 2025-08-02 10:15 GMT

శ్రుతిహాసన్ రీసెంట్ డేస్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవలే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో పాటు ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ సలార్ మూవీతో హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. లోకేశ్ కనగరాజ్ రజనీ కాంత్ కాంబోలో వస్తోన్న కూలీ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోంది. అలాగే విజయ్ సేతుపతి ట్రైన్ మూవీలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. ఇక సలార్ పార్ట్ 2లోనూ ఆమె నటిం చాల్సి ఉంది. దీంతో పాటు మరి కొన్ని క్రేజీ ప్రాజెక్టులు శ్రుతి చేతిలో ఉన్నాయి. శ్రుతి హాసన్ తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ బ్లాక్ డ్రెస్ లో మె రిసిపోతున్న ఫొటోలను షేర్ చేసింది. దీనికి కవితాత్మకమైన సందే శాన్ని జోడించింది. "ముద్దు కేవలం ముద్దు, నిట్టూర్పు కేవలం నిట్టూర్పు, ప్రాథమిక విషయాలు వర్తిస్తాయి, కాలం గడిచేకొద్దీ." ఇద్దరు ప్రేమికులు ప్రేమలో పడినప్పుడు, వారు ఇప్పటికీ 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అని అంటారు. భవిష్యత్తు ఎలాంటిది తీసుకొచ్చినా దానిపై ఆధార పడాల్సిం దే' అని రాసుకొచ్చింది.

Tags:    

Similar News