Vana Veera Movie : పెద్ద సినిమాలకు మంచి రోజులెప్పుడు..?

Update: 2025-12-30 12:50 GMT

పెద్ద సినిమాలకు మంచి రోజులెప్పుడు..? ఈ ప్రశ్న మనం రోజూ వినేదే. వినాల్సి రావాల్సిన పరిస్థితిలో వచ్చినప్పుడే ఆ ప్రశ్న సంధించబడుతుంది. ఇంతకీ అసలీ రోజు ఎప్పుడూ అంటే.. టికెట్ ధరలు తగ్గినప్పుడు. యస్.. టికెట్ ధరలు తగ్గితేనే కానీ ఇప్పుడు సినిమా బ్రతికేలా లేదు. సినిమా బతకాలంటే టికెట్ ధరలు తగ్గించాల్సిందే అనేవాళ్లు రోజు రోజుకూ పెరుగుతున్నారు. ఇంకా చెబితే కొత్త సినిమాలు రిలీజ్ అయిన టైమ్ లో ఆ ధరలు ఇంకాస్త పెంచుకోవడానికి ప్రభుత్వాలే పర్మిషన్ ఇవ్వాల్సిన దుస్థితి ఉంది. అయితే టికెట్ ధరలు తగ్గితేనే సినిమాలు బతికి ఉంటాయి అనేందుకు రీసెంట్ గా రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఒక ఉదాహరణ. వాళ్లు కేవలం 99 రూపాయలే టికెట్ ధరలు పెంచారు. అందుకు తగ్గట్టుగానే థియేటర్స్ లో జనం పోటెత్తారు. కంటెంట్ బావుంది. సినిమా విజయం అయింది.

తాజాగా జనవరి 1న విడుదల కాబోతోన్న మూవీస్ విషయంలో కూడా ఇదే జరగబోతోంది. సైక్ సిద్ధార్థ్ మూవీ కూడా 99 రూపాయలే టికెట్ ధర అని నిర్ణయించారు. అలాగే వన వీర చిత్రం విషయంలో ఇదే జరగబోతోంది. వాళ్లు కూడా 99 రూపాయలే టికెట్ ధర అని నిర్ణయించారు. ఆ రెండు సినిమాలు కంటెంట్ పై నమ్మకం ఉన్న చిత్రాలుగా కనిపిస్తున్నాయి. ఆ కంటెంట్ ఎక్కువమందికి వెళ్లడం అనేది అవసరం. ఆ అవసరాన్ని నిర్ణయించుకునే అవకాశం కూడా ఆ మూవీకు వచ్చింది. కావడానికి అవి చిన్న సినిమాలే. కానీ పెద్ద చిత్రాలు కాబట్టి వాటి వినోదం విలువ పెరగడం తప్పు కదా. అందుకే పెద్ద సినిమాల విషయంలోనూ పెద్ద మిస్టేక్ జరుగుతోంది. ఈ చిత్రాలు కంటెంట్ పరంగా మాత్రమే ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఆ ఓపెనింగ్స్ టికెట్ ధరలను బట్టి కొనసాగడం మాత్రం సినిమా పరిశ్రమ మనుగడకు ఇబ్బంది కాబోతోంది అనేందుకు ఏ మాత్రం సందేహం లేదు. అసలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా టికెట్ ధరలు తగ్గించాలి అని అడగడం లేదు. కేవలం మన దేశంలో.. అదీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లోనే కనిపించడం మాత్రం ఖచ్చితంగా తప్పే అవుతుంది. కొందరు నిర్మాతలు చెప్పినట్టుగా ‘మా సినిమాకు టికెట్ ధరలు తగ్గించాము’ అని చెప్పుకోవడం కూడా ఒక ప్రమోషన్ లా అవుతోంది అంటే అంతకు మించిన దౌర్భాగ్యం ఏముందీ. మొత్తంగా రాన్రాను ఈ సినిమాల టికెట్ ధరలతో పాటు పాప్ కార్న్ విషయంలో కూడా ఒక మార్పు స్పష్టం అవడం మాత్రం అనివార్యం అవుతోంది. ఇలాంటి పెద్ద సినిమాలైనంత మాత్రాన టికెట్ ధర పెరగడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సి ఉంది. అందుకు ఈ మధ్య టికెట్ ధరలు తగ్గించుకున్నాం అని చిన్న సినిమాలు చేసుకుంటోన్న ప్రమోషన్స్ ఓ కారణంగా మొదలవుతోంది అనేది చెప్పొచ్చు. 

Tags:    

Similar News