తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పంజాబీ ముద్దుగుమ్మ అయినప్పటికీ టాలీవుడ్‌లో పలు చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలనైనా సరే ధైర్యంగా తెలియజేస్తూ ఉంటుంది పూనమ్ కౌర్. ఆ టాలీవుడ్ డైరెక్టర్‌నే కాకుండా బడా హీరోలను కూడా టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల తిరుపతి లడ్డు వివాదంలో కూడా పూనమ్ కౌర్ తన ట్విట్టర్ నుంచి చేసిన ఘాటు వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. తాజాగా పూనమ్ ఎక్స్ వేదికగా.. ‘‘హిందూ మతాన్ని స్వలాభం కోసమే ఉపయోగించడం వేరు.. హిందూ మతాన్ని నమ్మే వ్యక్తిగా ఉండటం వేరు’’ అనే విధంగా ఒక కొటేషన్‌ని రాసి ట్వీట్ చేసింది. అయితే ఈమె ఇది ఎవరిని ఉద్దేశించి షేర్ చేసిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ బడా హీరో పొలిటికల్ నేతని టార్గెట్ చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.