Shweta Tiwari : ఎవరీ శ్వేతా తివారీ.. రెండుసార్లు విడాకులు తీసుకొని..
Shweta Tiwari : మధ్యప్రదేశ్‌కి చెందిన నటి శ్వేతా తివారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి.;
Shweta Tiwari : మధ్యప్రదేశ్‌కి చెందిన నటి శ్వేతా తివారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. ఇటీవల ఆమె ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. అయితే ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ.. 'నా లోదుస్తుల సైజు దేవుడే తీసుకుంటున్నాడు.' అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. మహాభారత్ ఫేమ్ సౌరభ్ ఈ వెబ్‌సిరీస్‌లో బ్రా ఫిట్టర్ అనే పాత్రలో కనిపించనున్నాడు. సౌరభ్ పాత్రను ఉద్దేశిస్తూ నా లోదుస్తుల సైజులు దేవుడు తీసుకుంటున్నాడంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆమె పైన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో ఆమె క్షమాపణలు చెప్పింది. ఈ క్రమంలో అసలు ఎవరీ శ్వేతా తివారీ అని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
ఉత్తరప్రదేశ్‌కి చెందిన శ్వేతా తివారీ 1980లో జన్మిచింది మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత పలు సీరియల్స్, అక్కడినుంచి సిల్వర్ స్క్రీన్ పైన మెరిసింది. ఇక 1998లో నటుడు రాజా చౌదరిని వివాహం చేసుకుంది శ్వేతా.. ఈ జంటకి పాలక్ తివారీ అనే కుమార్తె ఉంది. అయితే రాజాచౌదరి ఆల్కహాల్ కి బానిసై.. తనని రోజు కొడుతున్నాడుని 2007లో అతని నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నటుడు అభినవ్ కోహ్లీతో దాదాపు మూడు సంవత్సరాల డేటింగ్ తర్వాత 2013లో వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే కోహ్లి తనను మరియు తన కుమార్తెను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కోహ్లీపై గృహహింస చట్టం కేసు పెట్టింది. ఆ తర్వాత వీరిద్దరూ 2019లో విడిపోయారు.
ఇక 2010లో బిగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొని విన్నర్‌గా నిలిచింది శ్వేతా తివారీ. బాలీవుడ్ బిగ్‌బాస్ షోలో విన్నర్‌గా నిలిచిన మొదటి మహిళగా ఆమెకి గుర్తింపు ఉంది. శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ ఇటీవలే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది, వయసు నాలుగు పదులు దాటినా ఎక్కడా తగ్గని అందంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రకారు మతి పోగొడుతోంది శ్వేతా.