నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ కు ఊపొస్తుంది. ఈ కాంబోలో ఇప్పటికే హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. బాలయ్య స్టామినాను పర్ఫెక్ట్ గా వాడతాడు బోయపాటి. ఆయన్ని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ కు పూనకం వస్తుందో ఇంకా బాగా తెలుసు. అందుకే ఈ కాంబోలో 4వ సినిమా అనౌన్స్ అవగానే బ్లాక్ బస్టర్ ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. పైగా ఇది అఖండకు సీక్వెల్. ఈసారి కూడా అఖండ 2 తాండవం అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు.
బోయపాటి సినిమా అంటే విలన్స్ ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇతర సినిమాలకు భిన్నమైన విలనీ చూపించే ప్రయత్నం చేస్తాడు బోయపాటి. ఇక బాలయ్య కోసం మరింత ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. బాలయ్య ఇమేజ్ ను సవాల్ చేసేలా ఉంటారు. అందుకే ఈ సారి విలన్ గా ఎవరిని తీసుకోబోతున్నాడా అంటూ ఆరాలు తీస్తున్నారు. అఖండలో శ్రీకాంత్ ను విలన్ గా చూపినా అతను మెయిన్ విలన్ కాదు. ఇతర పాత్రలన్నీ పవర్ ఫుల్ గానే సెట్ చేశాడు. మరి ఇప్పుడు అంతకు మించిన పవర్ ఫుల్ విలన్ కావాలి. అందుకే ప్రస్తుతం సౌత్ లో విలన్ సత్తా చాటుతున్న ఖల్ నాయక్ ను సెట్ చేయాలనుకుంటున్నారట.
యస్.. అఖండ తాండవంలో విలన్ గా సంజయ్ దత్ ను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ కాస్టింగ్ కు సంబంధించి కేవలం ప్రగ్యా జైశ్వాల్ మాత్రమే కన్ఫార్మ్ అయింది. ఇతర ఆర్టిస్టులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. విలన్ గా సంజయ్ దత్ అయితే సినిమాకు మరింత వెయిట్ వస్తుంది. పైగా ఈ సారి ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకుంటున్నారు కాబట్టి అదీ ప్లస్ అవుతుంది. మొత్తంగా 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.