తెలుగులో వచ్చిన సెన్సేషనల్ హిట్ సినిమా న్యాయం కావాలి. డి కామేశ్వరి రాసిన కొత్త మలుపు నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ నవల ఆధారంగానే చిత్రం పెద్ద విజయం సాధించింది. శారద, చిరంజీవి, రాధిక, జగ్గయ్య కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఏ కోదండరామి రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం హిందీలో ముఝే ఇన్సాఫ్ ఛాహియే, తమిళ్ లో విధి, మళయాలంలో తాళం తెట్టియ తారాట్టు పేరుతో రీమేక్ అయింది. అయితే ముందుగా కన్నడలో మాత్రం కేరళిద హెన్ను పేరుతో రూపొందించారు.
అందులో చిరంజీవి పాత్రను శంకర్ నాగ్ రాధిక పాత్రను విజయశాంతి శారదా పాత్రను జయంతి పోషించారు. ఇక్కడ కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే కన్నడలో ఒకటో రెండో సినిమాలు చేసిన విజయశాంతి కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పుడప్పుడే ఇతరతర భాషల్లో విజయం సాధించే ప్రయత్నాల్లో ఉంది తను. ఆ కారణంగా కేరళిద హెన్ను హిట్ అవడంతో తిరిగి కన్నడలో చేసే అవకాశం వచ్చింది. కానీ డేట్స్ లేక చెయ్యలేదు. అందుకు కారణం టి కృష్ణ.
కేరళిద హెన్ను చిత్రంలో తన నటనకు మంచి పేరు వచ్చింది. దీంతో పాటు చాలా ఆఫర్స్ వచ్చాయి. బట్ తను మాత్రం కన్నడకు కాదు అని తెలుగుకు ప్రాధాన్యం ఇచ్చింది. అంతే కాదు అపుడే శ్రీరంగ నీతులు, పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు హిట్ అవడంతో తెలుగులోనే ఎక్కువ అవకాశాలు అందుకుంది. బట్ తనకు తెలుగులో ఎక్కువ అవకాశాలు రావడానికి కారణం టి కృష్ణ దర్శకత్వం చేసిన నేటి భారతం చిత్రం. కథానాయిక ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రంలో తన నటనకు జేజేలు పలికారు జనం. మరోవైపు కేరళిద హెన్ను చిత్రానికీ పెద్ద ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. కానీ తను మాత్రం నేటి భారతంకు ఎక్కువ అవకాశం ఇచ్చింది. అది టి కృష్ణ మొదటి సినిమానే అయినా సూపర్ హిట్ అందుకుంది. ఆ కారణంగా కన్నడ భాషను వదులుకోవాల్సి వచ్చింది. మరోవైపు తెలుగులో ఆఫర్స్ తో పాటు రెమ్యూనరేషన్ పరంగా పెరగడం కూడా ఓ కారణంగానే కనిపిస్తుంది.
అయితే కన్నడ మూవీ కేరళిద హెన్ను చిత్రంలో ఆమె నటన సైడ్ పాపటి తీసి వాలుజడ తో అటు పల్లెటూరి అమ్మాయిల ఇటు మోడర్న్ అమ్మాయిలా నటించి మెప్పించింది. శంకర్ నాగ్ తన అందం తో హుషారు నటనతో ఇక్కడ చిరంజీవి ఎలానో కన్నడ లో అతను మంచి పేరు తెచ్చుకున్నాడ. కానీ 1990 లో కారు ఆక్సిడెంట్ లో అతి చిన్న వయసులో మృతి చెందాడు.